Trends

ఆటా ఆధ్వర్యంలో విన్స్కాన్సిన్  రాష్ట్రం లో  మిల్వాకీ టీం ప్రారంభం

అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఆటా, వారి ఆధ్వర్యంలో విస్కాన్సిన్ రాష్ట్రంలో ఆటా మిల్వాకీ టీం శనివారం సెప్టెంబర్ 10 వ తారీఖున ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల గారి చేతుల మీదుగా ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు. మంగళ వాద్యాలతో ఆహ్వానం పలికి ఆటా టీం సబ్యులని ఘనంగా సత్కరించారు. సాండ్ వాలీ బాల్ టోర్నమెంట్ నిర్వహించారు, 12 పైగా వాలీ బాల్ టీమ్స్ పాల్గొన్న ఈ కార్యక్రమం లో లెవెల్ 1 లో NB కింగ్స్ టీం విజేతలుగా నిలవగా వైకింగ్ వారియర్స్ టీం రన్నర్ అప్ గా నిలిచారు. లెవెల్ 2 విన్నెర్స్ గా NB రైడర్స్, NB గల్లీ బాయ్స్ నిలిచారు.

మేళ తాళాలతో ఎంతో అట్టహాసంగా నిర్విహించిన కార్యక్రమంలో విజేతలకు బహుమతులు అందచేశారు. న్యూ బెర్లిన్ తెలుగు వారు ఇంటిలో వండిన వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేసారు. ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు ౩౦౦ మందికి పైగా పాల్గొన్నారు. మహిళలు పిల్లలు సందడి చేసారు.

ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల మాట్లాడుతూ ఆటా కార్యక్రమాల గురించి వివరించారు, మహిళలు సమాజ సేవలో విరివిగా పాల్గొనాలి అని పిలుపునిచ్చారు. ఆటా మిల్వాకీ టీం ఏర్పాటుకు చురుకైన పాత్ర పోషించిన చంద్ర మౌళి సరస్వతి రీజినల్ కోఆర్డినేటర్ గా, పోలిరెడ్డి గంట రీజినల్ డిరెక్టర్ గా నియమించారు. ఆటా సెక్రటరీ హరి ప్రసాద్ రెడ్డి లింగాల, ఆటా కోశాధికారి సాయినాథ్ రెడ్డి బోయపల్లి, ఆటా బోర్డు అఫ్ ట్రస్టీ మెహెర్ మేడవరం మిల్వాకీ టీం ఏర్పాటుకు సహకారం అందించారు.

చంద్ర మౌళి ఆటా చికాగో టీం సభ్యులకు ఈ కార్యక్రమం నిర్వహించటానికి ప్రోత్సాహం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పోలిరెడ్డి మాట్లాడుతూ ఆటా కార్యవర్గానికి తమ వంతు తోడ్పాటు అందిస్తామని ప్రకటించారు. పోలిరెడ్డి సహచర సభ్యులు కరుణాకర్ రెడ్డి దాసరి, వెంకట్ చిగురుపాటి, దుర్గ ప్రసాద్ రబ్బ, వంశి ఎదపై, శ్రీకాంత్ కురుమద్దాలి, జగదీశ్ కట్ట, వినోద్ కుమార్ కాచినేని, అనిల్ వెంకటప్పాగారి, జయంత్ పర, లక్ష్మి రెడ్డి పెద్దగోర్ల, గంగాధర్ నల్లూరి, గోపాల బలిపురా, నారాయణస్వామి, ఫణి గారపాటి, శరత్ పువ్వాడి, లక్సమం ప్రసాద్ జయంత్, సత్య జగదీశ్ బాదాం, చంద్ర శేఖర్ ఈ కార్యక్రమం నిర్వహించటంలో సహకారం కొనియాడారు.

CLICK HERE!! for Photo Gallery.

Content Produced by Indian Clicks, LLC

This post was last modified on September 15, 2022 7:01 pm

Share

Recent Posts

ఈ దెబ్బతో గొడ్డలి పార్టీ మూతపడాలి

స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీ క్లిన్ స్వీప్ చేయాలి. ఆ దెబ్బతో గొడ్డలి పార్టీ మూత పడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు…

17 minutes ago

ఎక్కాల్సిన రైలు బాగా లేటయ్యింది

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలని పెద్దలు అంటారు. పెళ్లి, పిల్లలు ఏదైనా సరే ఏజ్ బార్…

33 minutes ago

నాన్న, అమ్మ, కొడుకు.. ఇప్పుడు కూతురు కూడా

సినిమా కుటుంబాల నుంచి వారసులు ఇండస్ట్రీలోకి రావడం చాలా మామూలు విషయం. ఐతే ఒక కుటుంబంలో తండ్రి హీరోగా, తల్లి…

2 hours ago

స్థానిక ఎన్నికలు మీ భవిష్యత్తు

గత ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను పనిచేశాను. స్థానిక ఎన్నికలు మీ భవిష్యత్తు. మీ అవసరాల కోసం. అందుకే…

6 hours ago

మోడీ ప‌ర్య‌ట‌న‌… బ్లాక్ డ్రెస్‌లో సీఎం విజ‌య్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఆదివారం త‌మిళ‌నాడులో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు ప్రారంభించారు. అయితే..…

11 hours ago

టికెట్ల రేట్ల ఎఫెక్ట్ చూశారా?

తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…

11 hours ago