59 చైనీస్ మొబైల్ యాప్స్ ను రద్దు చేస్తూ భారత్ తీసుకున్న సంచలన నిర్ణయంతో తగిలిన్ షాక్ నుంచే ఇంకా తేరుకోని చైనాను అమెరికా మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్ అయిన యాపిల్ భారీగా దెబ్బకొట్టింది. అయితే, ఇది తమ నిబంధనల సవరణలో భాగంగా మాత్రమే అని పేర్కొంది. తాజాగా యాపిల్ సంస్థ యాప్ స్టోర్ లోని 4500 చైనీస్ గేమ్ యాప్స్ ను తొలగించింది. కేవలం మూడు రోజుల వ్యవధిలో వీటిని తొలగించడం సంచలనం అయ్యింది.
ఈ నిర్ణయంపై పూర్తి క్లారిటీతో యాపిల్ ఒక ప్రకటన చేసింది. లైసెన్స్ నిబంధనలను తాము మరింత కఠినతరం చేస్తున్నట్లు ఏడాది క్రితమే ప్రకటించామని, అందులో భాగంగా ఈ యాప్స్ తమ అర్హతను కోల్పోవడం వల్ల తొలగించాం అని పేర్కొంది. వీటిని నిషేధించలేదు, కేవలం తొలగించాం అని చెప్పింది.
యాప్ స్టోర్ కొత్త నిబంధనలకు అనుగుణంగా ఆ యాప్స్ ను రీడిజైన్ చేసుకుని, మా ప్రమాణాలకు అనుగుణంగా మారిస్తే యాప్ స్టోర్ లో మళ్లీ అప్ లోడ్ చేసుకోవచ్చని చెప్పింది.
భారత్ నిర్ణయంతో ఇప్పిటే సుమారు లక్ష కోట్లు నష్టపోయినా చైనా… యాపిల్ కంపెనీ నిర్ణయంతో చావు దెబ్బ తినింది. ఈ చర్య చైనాను మరింత ఒత్తిడిలోకి నెట్టే ప్రమాదం ఉంది.
ఆర్థికంగా కూడా చైనా బాగా నష్టపోతుందని నిపుణులు చెబుతున్నారు. చట్టపరమైన అనుమతులు లేని గేమ్స్ తాము ఎన్నటికి అనుమతించమని… అన్ని దేశాల చట్టాలకు అనుగుణంగా ఉంటేనే వేటికైనా మా వద్ద స్థానం ఉంటుదని పేర్కొంది. సరిగ్గా ఈ ప్రకటనకు మూడు రోజుల ముందే ట్రంప్… నాకు చైనాపై రోజురోజుకు కోపం రెట్టింపవుతుందని ప్రకటించిన విషయం తెలిసిందే.
This post was last modified on July 6, 2020 10:31 am
అగ్ర రచయిత పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తుతం సినిమాలకు రచన చేయకపోయినా కొత్త రిలీజులు చూస్తూ వాటి తాలూకు లోటుపాట్లు, ప్లస్…
ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరఫున 11 మంది ఎమ్మెల్యేలు విజయం దక్కించుకున్నారు. వీరిలో జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి…
అసెంబ్లీకి వెళ్లకుండా జగన్ కుంటి సాకులు చెబుతున్నారని, సభ అంటే గౌరవం లేని జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని…
టాలీవుడ్ బాక్సాఫీస్ మరో ఆసక్తికరమైన క్లాష్ కు సిద్ధమయ్యింది. ఆయా హీరోలకు తమ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన రెండు…
బాహుబలి స్థాయి సినిమాగా కోలీవుడ్లో ప్రచారం జరిగిన కంగువ సినిమాకు రిలీజ్ ముంగిట తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. అటు…
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…