Trends

టిక్ స్టార్ దారుణం చేశాడు

టిక్ టాక్ యాప్ మనుషుల్లోని సున్నితత్వాన్ని చంపేస్తోందని.. పశు ప్రవృత్తిని రెచ్చగొడుతోందని.. దీని వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయని కొంత కాలంగా తీవ్ర విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. ఈ యాప్‌లో కొందరి చర్యలు చూస్తే షాకవ్వక తప్పదు.

అమ్మాయి కాదంటే యాసిడ్ పోయాలన్న సంకేతాన్నిచ్చే వీడియోతో మొదలుపెడితే.. ఎన్నో నెగెటివ్ థాట్స్‌ను ప్రమోట్ చేసే వీడియోలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మనుషుల విపరీత ప్రవర్తనకు ఎన్నో టిక్ టాక్ వీడియోలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

తాజాగా టిక్ టాక్‌లో తిరుగులేని ఫాలోయింగ్ ఉన్న ఓ కుర్రాడు.. తాను ప్రేమించిన అమ్మాయిపై దారుణానికి ఒడిగట్టాడు. ఆ అమ్మాయిని చంపేశాడు. ఈ విషయంలో అతను ముందే టిక్ టాక్ ద్వారా సంకేతాలు కూడా ఇవ్వడం గమనార్హం.

ఆ టిక్ టాక్ స్టార్ పేరు.. షేర్ ఖాన్ చౌదురి. అతడికి టిక్‌టాక్‌లో ఏకంగా 4 లక్షల ఫాలోవర్లున్నారు. అతను నైనా కౌర్ అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయికి ఇతనంటే ఇష్టం లేదు. ఇతడిది వన్ సైడ్ లవ్. జూన్ 22న నైనా పెళ్లి జరగబోతోందని షేర్ ఖాన్‌కు తెలిసింది. వెళ్లి నైనాతో ఏం మాట్లాడాడో.. ఆమె ఏమందో కానీ.. కత్తితో దారుణంగా పొడిచి పారిపోయాడు. ఆమె ప్రాణాలు విడిచింది. షేర్ ఖాన్ జాడ తెలియట్లేదు.

ఈ దారుణానికి పాల్పడటానికి ముందు రోజు షేర్ ఖాన్ ఒక వీడియో పెట్టాడు. అందులో కంప్యూటర్ కీబోర్డు మీద రింగు పెట్టి పై నుంచి ఒక్కో అక్షరం మీదుగా.. కిందికి వచ్చి.. ‘ఎన్’ అనే అక్షరం దగ్గర ఆగి దాని మీద రింగ్ పెట్టాడు. ఇది నైనాను ఉద్దేశించి చేసిన వీడియోనే అని స్పష్టంగా అర్థమవుతోంది. రింగ్ ‘ఎన్’ అనే అక్షరం మీద పెట్టడం ద్వారా ఆమెతో ఎంగేజ్మెంట్ అయినట్లు ఊహించుకున్నాడా.. లేక ఆమెను చంపబోతున్నట్లు సంకేతం ఇచ్చాడా అన్నది తెలియడం లేదు.

This post was last modified on June 20, 2020 12:46 pm

Share
Show comments
Published by
Satya
Tags: Tik Tok

Recent Posts

పాడిపంటల పండుగ సంక్రాంతి విశిష్టత మీకు తెలుసా?

తెలుగింటి సంక్రాంతి అంటే సంబరాల పండుగ అని ప్రసిద్ధి. మూడు రోజులపాటు ఎంతో ముచ్చటగా జరుపుకునే ఈ పండుగ వెనుక…

1 hour ago

ఎక్స్‌ట్రా 18 నిముషాలు… ఏంటా కథ ?

నెల రోజులుగా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన పుష్ప 2 ది రూల్ సహజంగానే నెమ్మదించింది. వీకెండ్స్ మినహాయించి మాములు…

3 hours ago

‘డాకు’ పై హైప్ ఎక్కిస్తున్న నాగవంశీ

తమ సినిమాల గురించి మేకర్స్ అందరూ ఆహా ఓహో అనే చెబుతుంటారు. రిలీజ్ ముంగిట గొప్పలు పోతుంటారు. కానీ అందరి…

4 hours ago

రీరిలీజ్ ఫీవర్ వాళ్లకూ పాకింది

గత రెండేళ్ల నుంచి తెలుగులో రీ రిలీజ్‌ల హంగామా ఎలా నడుస్తోందో తెలిసిందే. పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం…

7 hours ago

పవన్ ప్రసంగంలో ఆలోచింపజేసే విషయాలు!

రాజమండ్రిలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ప్రసంగంలో…

8 hours ago

రావిపూడినా మజాకా!

టాలీవుడ్లో చాలామంది దర్శకులు మేకింగ్ విషయంలో బాగా టైం తీసుకునేవాళ్లే. స్క్రిప్టు పక్కాగా సిద్ధం చేసుకోకపోవడం, సరైన ప్రణాళికలతో షూటింగ్‌కు…

8 hours ago