కరోనా సహా వాటి కొత్త వేరియంట్‌ల పుట్టుక వల్ల పాఠశాలలను మూసివేయడాన్ని ప్రస్తుతానికి సమర్థించుకోలేమని ప్రపంచ బ్యాంకు విద్యా విభాగం డైరెక్టర్ జేమీ సావ్‌ద్రా అన్నారు. ప్రపంచ విద్యారంగంపై కరోనా ప్రభావం పట్ల అధ్యయనం చేస్తున్న ఆయన.. కొత్త కొవిడ్ వేరియంట్లు వస్తే పాఠశాల మూసివేతను చివరి మార్గంగా అనుసరించాలని సూచించారు. పాఠశాలలు సురక్షితంగా లేకపోవడం సహా తిరిగి తెరిస్తే కరోనా కేసులు పెరుగుతాయన్న విషయంపై ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. పాఠశాలలను తెరవడానికి, కరోనా వ్యాప్తికి ఎలాంటి సంబంధం లేదని జేమీ సావ్‌ద్రా వివరించారు.
బార్లు, రెస్టారెంట్‌లు, షాపింగ్ మాళ్లను తెరిచి, పాఠశాలలను మూసివేయడంలో అర్థం లేదన్నారు. దీన్ని క్షమించలేమని పేర్కొన్నారు. పాఠశాలలను తెరిచినా పిల్లల ఆరోగ్యానికి ప్రమాదం తక్కువే అని తమ అధ్యయనాల్లో తేలిందని వివరించారు. పాఠశాలల మూసివేత వల్ల భారీగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వెల్లడించారు. పిల్లలకు టీకాలు వేసిన తర్వాతే పాఠశాలలను తిరిగి తెరవాలనే నిబంధనను ఏ దేశంలోనూ లేదని.. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాల్లేవని పేర్కొన్నారు.
2020కు సంబంధించి “బీటెన్ లేదా బ్రోకెన్? ఇన్ఫార్మాలిటీ, దక్షిణాసియాలో కరోనా” పేరుతో ప్రపంచ బ్యాంకు విద్యా విభాగం ఓ నివేదికను రూపొందించింది. దేశంలో కరోనా కారణంగా పాఠశాలలను దీర్ఘకాలికంగా మూసివేయడం వల్ల భవిష్యత్తులో 400 బిలియన్ డాలర్లకు మించిన నష్టం వాటిల్లుతుందని అంచనా వేసింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్ సహా పలు దేశాల్లో కరోనా కేసులు భారీగా వెలుగుచూస్తున్నాయి. ఫలితంగా వైరస్ కట్టడికి కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. అయితే, పాఠశాలలను మాత్రం మూసేయొద్దని ప్రపంచ బ్యాంకు పేర్కొనడం గమనార్హం.
This post was last modified on January 16, 2022 10:22 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కు నేటితో 41 ఏళ్లు నిండాయి.…
నేడు… జనవరి 23… టీడీపీ జాతీయ ప్రదాన కార్యదర్శి, ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ జన్మదినం. మొన్నటి…
స్విట్జర్లాండ్ నగరం దావోస్ గడచిన 4 రోజులుగా భారీ జన సందోహంతో కిటకిటలాడుతోంది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్…
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
అసలే అది ఇన్వెస్టర్ల సమావేశం. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయా దేశాలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఇన్వెస్టర్లను ప్రసన్నం చేసుకునేందుకు…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…