Trends

ఒమిక్రాన్ లక్షణాల్లో ఇవెంతో కీలకం

మన దేశంతో పోలిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న ఒమిక్రాన్ కేసులు భారీగా ఉంటున్నాయి. ఇక.. అమెరికా.. లండన్ లో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. లక్షలాది కేసులు నమోదు అవుతున్నా.. ఒమిక్రాన్ లక్షణాలకు సంబంధించి మాత్రంపెద్దగా బయటకు రాలేదు. ఇలాంటి వేళ కింగ్స్ కాలేజ్ లండన్ హెల్త్ సైన్స్ కంపెనీ జీఓఈ నిపుణులు కొన్ని లక్షణాల్ని వెల్లడించారు.

ఒమిక్రాన్ బారిన పడిన 3.36లక్షల మంది డేటా నుంచి వివరాలు సేకరించి అధ్యయనం చేశారు. ఈ లక్షణాలు ఎక్కువగా యువతలో కనిపించాయని పేర్కొన్నారు.
కరోనా పాజిటివ్ రోగుల్లో 8.8 వాతం మందికి చర్మంపై దద్దుర్లు ఉన్నట్లు గుర్తించారు. అదే సమయంలో కొవిడ్ బారిన పడిన వారిలో 8.2 శాతం మంది కొవిడ్ పరీక్షలు చేయించుకోలేదు. అధ్యయనం చేసిన వారిలో 17 శాతం పాజిటివ్ బారిన పడిన వారిలో చర్మంపై దద్దుర్లు తమ మొదటి లక్షణంగా వారు పేర్కొనటం గమనార్హం.

O.iప్రతి ఐదుగురిలో ఒకరు చర్మం మీద దద్దుర్లు కరోనా బారిన పడటానికి సంకేతంగా గుర్తించినట్లు చెప్పారు. పలువురి నుంచి వివరాల్ని సేకరించిన ఈ అధ్యయనం ఏం చెబుతుందంటే..

  • అసాధారణంగా చర్మంపై దద్దుర్లు.. దురదలు ఉంటే ఒమిక్రాన్ కావొచ్చు.
  • కోల్డ్ బైల్ రీచ్ గా.. హటాత్తుగా చర్మం మీద దద్దుర్లు వస్తాయి. దీంతో చాలా దురదను ఎదుర్కొంటారు. అయితే.. వచ్చినంత త్వరగానే వాటంతట అవే పోతాయి. ఈ దద్దర్లు శరీరంలో ఏ భాగంలో అయినా రావొచ్చు. దద్దుర్లు ఒమిక్రాన్ రాకకు సంకేతంగా నిలుస్తాయి.
  • చికెన్ పాక్స్ లాంటి దద్దుర్లుకూడా కొందరికి వస్తాయి. ఇవి ఎక్కువగా మోచేతులు..మోకాళ్లు.. చేతులు.. కాళ్ల వెనుక భాగంలో వస్తాయి. చిన్నగా ఉండే ఇవి ఎరుపు రంగులో ఉంటాయి. దురదను కలిగిస్తాయి. వారం.. రెండు వారాల పాటు ఇబ్బందికి గురి చేయొచ్చు.
  • చిల్ బ్లెయిన్ దద్దుర్లు సాధారణంగా శీతాకాలంలో వస్తాయి. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో కూడా ఎక్కువగా కనిపిస్తాయి. ఇందులో వ్యక్తి పాదాలు.. చేతి వేళ్లపై ఎరుపు.. ఊదా రంగు దద్దుర్లు ఏర్పడతాయి. దద్దుర్లకు బదులు వాపు కూడా ఉంటుంది.
  • ఒమిక్రాన్ లక్షణాల్లో జలుబు.. దగ్గు.. గొంతునొప్పి.. రుచి.. వాసన కోల్పోవటం.. ఆకలి లేకపోవటం.. దడ.. కండరాల నొప్పులు లాంటి లక్షణాల్ని గుర్తించారు.

This post was last modified on January 1, 2022 8:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

38 mins ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

3 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

3 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

4 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

5 hours ago