Trends

ఒమైక్రాన్ టెన్షన్ పెరుగుతోందే

దేశాన్ని ఇపుడు ఒమైక్రాన్ వేరియంట్ వణికించేస్తోంది. గడచిన ఏడాదిన్నరగా దేశాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ తగ్గిపోతోంది కదాని రిలాక్సుడుగా ఉంటే హఠాత్తుగా ఒమైక్రాన్ విరుచుకుపడుతోంది. కరోనా వైరస్ కన్నా పదిరెట్లు ప్రమాధకరమైన కొత్త వేరియంట్ తో ఇప్పటికే 35 దేశాలు వణికిపోతున్నాయి. దక్షిణాఫ్రికా నుంచి విదేశాలకు వెళ్ళిన వారిని వెతికి పట్టుకోవడం, పరీక్షలు నిర్వహించడం, అంతవరకు వారిని క్వారంటైన్ సెంటర్లలో పెట్టడం ఇపుడు పెద్ద సమస్యగా మారిపోయింది.

ఒమైక్రాన్ మొదట గుర్తించింది దక్షణాఫ్రికాలోనే కాబట్టి ఆ దేశానికి చాలా దేశాలు విమాన ప్రయాణాలను రద్దు చేసుకున్నాయి. అయితే అప్పటికే దక్షిణాఫ్రికా నుండి వివిధ దేశాల్లోకి ప్రవేశించిన వారి కోసం ఆయా దేశాలు వెతుకుతున్నాయి. ఇందులో భాగంగానే మనదేశంలోకి కూడా చాలామందే దిగారు. ఇపుడు వీరందరిని ట్రేస్ చేసేపనిలో ఉన్నతాధికారులు బిజీగా ఉన్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 21 ఒమైక్రాన్ కేసులు బయటపడ్డాయి. వీటిలో రాజస్థాన్ లోని జైపూర్ లోనే 9 కేసులు బయటపడటంతో రాష్ట్రమంతా రెడ్ అలర్ట్ ప్రకటించారు.

జైపూర్లో బయటపడిన తొమ్మిది కేసుల్లో నలుగురు ఒక మ్యారేజీకి హాజరవ్వటంతో అధికారుల్లో టెన్షన్ బాగా పెరిగిపోతోంది. వీరి అంచనా ప్రకారం మ్యారేజిలకు హాజరైన వారిలో ఒమైక్రాన్ కేసులు ఎన్ని బయటపడతాయో చూడాలి. వీళ్ళు కాకుండా మహారాష్ట్ర, గుజరాత్, బెంగళూరు, ఢిల్లీలో కూడా ఒమైక్రాన్ కేసులు బయటపడ్డాయి. ఇప్పటివరకు ఒమైక్రాన్ సోకిన వారి ఆరోగ్య పరిస్ధితి, వ్యాధి లక్షణాల్లో నిర్దిష్ట లక్షణాలేవీ నిపుణులు చెప్పటం లేదు. ఎందుకంటే ఒక్కో నిపుణుడు ఒక్కో విధంగా చెబుతుండటంతో మామూలు జనాల్లో అయోమయం పెరిగిపోతోంది.

ఒకవైపు ఒమైక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయని ప్రభుత్వం టెన్షన్ పడుతుంటే మరోవైపు కరోనా వైరస్ కేసులు కూడా ఎక్కువైపోతున్నాయి.  తెలంగాణాలోని కరీంనగర్ మెడికల్ కాలేజీలోనే 43 మందికి కరోనా వైరస్ నిర్ధారణవ్వటంతో కాలేజీని అర్ధాంతరంగా మూసేశారు. అలాగే కొన్ని ఆశ్రమ స్కూళ్ళల్లోని విద్యార్ధులకు కూడా కరోనా పాజిటివ్ బయటపడింది. దీంతో కేసులు బయటపడిన విద్యాసంస్ధలను ప్రభుత్వం మూయించేస్తోంది. దీనికితోడు జనవరి-ఫిబ్రవరిలో మూడో వేవ్ రావచ్చని ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ చేసిన ప్రకటన టెన్షన్ పెంచేస్తోంది.

This post was last modified on December 6, 2021 10:38 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

2 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

2 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

3 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

4 hours ago

రెహమాన్ పై రూమర్స్.. బాధతో తనయుడి వివరణ

ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…

4 hours ago