ఒక సినిమా హీరోకు ఒక ప్రకటనలో నటించడం కోసం 265 కోట్ల రూపాయలు డబ్బు ఇవ్వడం గురించి ఎప్పుడైనా విన్నామా.. అది కూడా ఒక్క రోజులో ఆ యాడ్ షూట్ పూర్తి చేస్తామని చెబితే అది ఎంత పెద్ద ఆఫరో చెప్పేదేముంది? ప్రపంచంలో ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా సరే.. ఈ ఆఫర్‌ను తిరస్కరిస్తాడా? కళ్లు మూసుకుని కాల్ షీట్ ఇచ్చేయకుండా ఉంటాడా? కానీ హాలీవుడ్ స్టార్ జార్జ్ క్లూనీ మాత్రం ఈ బంపర్ ఆఫర్‌ను తిరస్కరించి అందరూ ముక్కున వేలేసుకునేలా చేశాడు. ఒక దేశానికి చెందిన ఎయిర్ లైన్స్ కంపెనీ.. తమ సంస్థకు సంబంధించిన యాడ్‌లో నటించేందుకు జార్జ్ క్లూనీకి 35 మిలియన్ యుఎస్ డాలర్లు ఆఫర్ చేసిందట.
అంటే ఆ మొత్తం భారతీయ కరెన్సీలో అయితే అక్షరాలా 265 కోట్ల రూపాయలు. కేవలం ఒక్క రోజు షూట్‌తో ఈ ప్రకటన పూర్తి చేస్తామని కూడా చెప్పారట. కానీ అతను ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి. అందుక్కారణం… ఆ విమానయాన కంపెనీ ఏ దేశంలో ఏర్పాటైందో… ఆ దేశం మీద క్లూనీకి సదుద్దేశం లేదట. మానవ హక్కుల ఉల్లంఘనలో సదరు దేశం తరచుగా వార్తల్లో నిలుస్తోందని.. ఇలాంటి దేశానికి చెందిన ఎయిర్ లైన్స్‌కు తాను ప్రచారం చేయలేనని ఖరాఖండిగా చెప్పేశారట. ఐతే ఆ దేశం, ఆ ఎయిర్ లైన్స్ పేర్లేంటన్నవి వెల్లడి కాలేదు.
మన దగ్గరా బోలెడన్ని బ్రాండ్లకు ప్రచారం చేసే సెలబ్రెటీలు ఉన్నారు. వాళ్లు ప్రచారం చేసే వాటిలో గుట్కా బ్రాండ్లున్నాయి. మద్యం బ్రాండ్లున్నాయి. తాము జీవితంలో ఎప్పుడూ ముట్టుకోని, ప్రమాదకర ఉత్పత్తులకు వాళ్లు ప్రచారం చేస్తుంటారు. తద్వారా తమ అభిమానులు, యువతను ప్రభావితం చేస్తుంటారు. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలన్న సూచనల్ని అస్సలు పట్టించుకోరు. ఇలాంటి నేపథ్యంలో జార్జ్ క్లూనీ వందల కోట్ల విలువైన డీల్‌ను తన విలువల కోసం కాదనుకోవడం విశేషమే.
This post was last modified on December 4, 2021 3:57 pm
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదైన వైనం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. హైదరాబాద్…
రేపు ఎంఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ ఓపెనింగ్ జరగనుంది. అల్లు అరవింద్, రాక్ లైన్ వెంకటేష్, బన్నీ వాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న…
నిన్నటి తమిళ కమెడియన్ ఇప్పటి హీరో సూరి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తిరుగుతూ ఆశ్చర్యానికి గురవుతున్నాడు. కారణం ప్రతి చోటా…
గత నెల మకుటం అనే సినిమా విడుదలయ్యిందనే సంగతి హార్డ్ కోర్ మూవీ ఫాలోయర్స్ కి తప్ప సామాన్య ప్రేక్షకులకు…
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం, టీడీపీ నేత ఆళ్ల నాని (57) కన్నుమూశారు. నానికి హఠాత్తుగా గుండెపోటు రావడంతో ఆయనను…
నిర్మాత నాగవంశీ ఈ మధ్య మంచి జోష్ లో ఉన్న విషయం తెలిసిందే. అఖిల్ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ లెనిన్…