Trends

ముంబయి ఇండియన్స్ కథ ముగిసినట్లే

గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శనతో వరుసగా రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచి ఔరా అనిపించింది ముంబయి ఇండియన్స్‌. మొత్తంగా ఐపీఎల్‌లో ఐదుసార్లు టైటిల్ సాధించి తనకు తానే సాటి అనిపించిందా జట్టు. అంతకుముందు వరకు ఒక సీజన్ విడిచిపెట్టి ఒక సీజన్ టైటిల్ గెలుస్తూ వచ్చిన ముంబయి.. గత సీజన్లో మాత్రం ట్రెండు మార్చింది. వరుసగా రెండో పర్యాయం కూడా విజేతగా నిలిచింది. ఇదే ఊపులో హ్యాట్రిక్ టైటిల్ సాధించి చరిత్ర సృష్టిస్తుందని.. ఆ జట్టుకు ఎదురుండదని అనుకున్నారు అభిమానులు.

ఐపీఎల్ 14వ సీజన్ ప్రథమార్ధంలో ఆ జట్టు తడబడ్డప్పటికీ.. ఇలా ఆరంభంలో ఇబ్బంది పడి ఆ తర్వాత పుంజుకుని ప్లేఆఫ్స్ చేరడం, టైటిల్ ఎగరేసుకుపోవడం ఆ జట్టుకు కొత్తేమీ కాదు కాబట్టి.. మరోసారి అదే కథ పునరావృతం అవుతుందనుకున్నారు. కానీ ఆ అంచనాలు తలకిందులైనట్లే కనిపిస్తున్నాయి.

13 మ్యాచ్‌లు ఆడి 6 విజయాలు మాత్రమే సాధించిన ముంబయి.. చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌గా కొంచెం గట్టిగా గెలిచి ప్లేఆఫ్స్ బెర్తు సాధించాలనుకుంది. ఈ లోపు కోల్‌కతా.. రాజస్థాన్ చేతిలో ఓడిపోవాలని ఆశించింది. ఒకవేళ గెలిచినా.. స్వల్ప తేడాలతో గెలవాలనుకుంది. కానీ ఆ జట్టు ఆశలు, అంచనాలకు భిన్నంగా.. రాజస్థాన్‌పై గురువారం భారీ విజయం సాధించింది నైట్‌రైడర్స్. మొదట 4 వికెట్లకు 171 పరుగులు చేసిన కోల్‌కతా.. తర్వాత రాయల్స్‌ను కేవలం 85 పరుగులకే కుప్పకూల్చి 86 పరుగుల తేడా ఘనవిజయాన్నందుకుంది. దీంతో ఇప్పటికే మెరుగ్గా ఉన్న నెట్ రన్‌రేట్ ఇంకా పెరిగి +0.587కు చేరుకుంది. ముంబయి నెట్ రన్‌రేటేమో -0.048గా ఉంది.

శుక్రవారం సన్‌రైజర్స్‌పై ముంబయి ఎంత భారీగా గెలిచినా ఈ రన్‌రేట్‌ను దాటి, కోల్‌కతాను వెనక్కి నెట్టడం, ప్లేఆఫ్స్ చేరడం కష్టమే. కాబట్టి నైట్‌రైడర్స్ దాదాపు ముందంజ వేసినట్లే. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి కథ ముగిసినట్లే. ఇక ఆల్రెడీ ప్లేఆఫ్స్‌కు దాదాపు దూరమైనప్పటికీ సాంకేతికంగా పోటీలో ఉన్న పంజాబ్, రాజస్థాన్.. కోల‌్‌కతా విజయంతో అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఇక ముంబయి కథే తేలాల్సి ఉంది.

This post was last modified on October 8, 2021 10:01 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

1 hour ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

2 hours ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

4 hours ago