విజయ్ మాల్యా.. ఈ పేరుకి పరిచయం అక్కర్లేదేమో. బ్యాంకుల్లో రూ.9వేల కోట్లకు పైగా కుచ్చుటోపి పెట్టి.. విదేశాల్లో దాక్కున్న ఈ కింగ్ ఫిషర్ అధినేత కు ఇప్పుడు ఊహించని షాకింగ్ తగిలింది. విజయ్ మాల్యా ఆస్తులను వేలానికి పెట్టే హక్కును బ్యాంకులు చట్టపరంగా సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని దేశంలోని పలు ప్రాంతాల్లో వున్న ఆయన ఆస్తులను ఒక్కొక్కటిగా వేలం వేస్తున్నాయి.
ఈ నేపథ్యంలోని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లోని విలేపార్లే ఏరియాలో ఉన్న కింగ్ ఫిషర్ హౌజ్‌ను బ్యాంకులు వేలం వేశాయి. ఈ భవనం వేలం ప్రారంభ ధర రూ.52 కోట్లుగా నిర్ణయించాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌కి చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ బేస్ ధర దగ్గరే ఈ భవంతిని సొంతం చేసుకున్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని ప్రచురించింది.
వేలంలో అమ్ముడైపోయిన భవనాన్ని బ్యాంకుల కన్సార్టియం 2016లో వేలంలో వుంచింది. అయితే దీని ప్రారంభ ధర రూ.150 కోట్లుగా పేర్కొనడంతో అప్పట్లో కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ తర్వాత పలుమార్లు బ్యాంకులు వేలానికి ప్రయత్నాలు చేసినా సానుకూల ఫలితాలు పొందలేదు. చివరకు చేసేది లేక ఆ భవనం ధర తగ్గించి ప్రారంభ ధర రూ. 52 కోట్లుగా నిర్ణయించడంతో వెంటనే అమ్ముడు పోయింది.
This post was last modified on August 15, 2021 10:07 am
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…