ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా అదరగొడుతోంది. ఇంగ్లాండ్ పై ఆధిపత్యం చెలాయిస్తోంది. లండన్ వేదికగా లార్డ్స్ మైదానంలో ఈ టెస్టు సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. రెండో టెస్టులో ఇండియా ఓపెనర్లు చరిత్ర సృష్టించారు. ఓపెనర్లుగా దిగిన రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ 126పరుగుల భాగస్వామ్యాన్ని ఏర్పర్చారు.
లార్డ్స్ మైదానంలో ఇండియా ఓపెనర్లు చేసిన అత్యధిక భాగస్వామ్యం ఇదే. దాదాపు 69ఏళ్ల తర్వాత ఇంతటి భాగస్వామ్యాన్ని నెలకొల్పి చరిత్ర తిరగరాసారు. గురువారం జరిగిన మ్యాచులో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అద్భుత ప్రదర్శన భారత్ కి అరుదైన ఘనతని అందించింది.
ఐదు సిరీస్ ల పర్యటనలో లార్డ్స్ మైదానంలో రెండవ మ్యాచు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, బౌలింగ్ ఎంచుకుని, భారత జట్టును బ్యాటింగ్ కి ఆహ్వానించాడు. మొదటి వికెట్ కు 126పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత 126పరుగుల వద్ద రోహిత్ శర్మ (83) ఔటయ్యాడు. అటు కేఎల్ రాహుల్ సెంచరీ పూర్తి చేసుకుని దూసుకుపోతున్నాడు. ఆట ముగిసే సమయాన్నికి 3వికెట్లు కోల్పోయి 276పరుగులు చేసారు.
This post was last modified on August 13, 2021 10:18 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…