క్రీడాకారులకు, అథ్లెట్లకు టాలెంట్ ఎంత ముఖ్యమో క్రమశిక్షణ, నియమ నిబద్ధత కూడా అంతే ముఖ్యం. క్రీడల్లో నైపుణ్యం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిన చాలామంది క్రీడాకారులు తాత్కాలిక నిషేదాలు, జీవితకాలపు నిషేధాలు ఎదుర్కొన్న సందర్భాలు క్రీడాచరిత్రలో కోకొల్లలు. తాజాగా ఈ తరహా జాబితాలోకి భారత మహిళా స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగాట్ చేరింది. టోక్సో ఒలింపిక్స్ శిబిరంలో అమర్యాదగా ప్రవర్తించినందుకుగాను ఆమెపై భారత రెజ్లింగ్ సమాఖ్య తాత్కాలిక నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
టోక్యో ఒలింపిక్స్ శిబిరంలో వినేష్ ఫొగాట్ అమర్యాదగా ప్రవర్తించిన కారణంగా డబ్ల్యూఎఫ్ఐ ఈ చర్యలు తీసుకుంది. అయితే, ఈ వ్యవహారంపై వివరణ ఇచ్చేందుకు వినేష్ ఫొగాట్ కు ఆగస్టు 16 వరకు గడువునిచ్చింది. అథ్లెట్లకు కేటాయించిన గదుల దగ్గర తోటి రెజ్లర్లతో కలిసి ఉండేందుకు వినేష్ ఫొగాట్ నిరాకరించిందని, వారితో ప్రాక్టీస్ చేయలేదని ఆమెపై అభియోగాలున్నాయి. దీంతోపాటు, భారత క్రీడాకారుల అధికారిక స్పాన్సర్ కిట్‌ను కూడా వినేష్ ఫొగాట్ ధరించలేదన్న ఆరోపణలున్నాయి. దీంతో, తాజాగా టోక్యో నుంచి వచ్చిన వినేష్ ఫొగాట్ కు డబ్ల్యూఎఫ్ఐ నోటీసులు జారీ చేసింది.
వాస్తవానికి, టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొనడానికి ముందు శిక్షణ కోసం హంగేరీ వెళ్లిన వినేష్ అక్కడి నుంచి టోక్యోకు వచ్చింది. అయితే, ఒలింపిక్స్ విలేజ్‌లో తనకు కేటాయించిన గదిలో తోటి రెజ్లర్లు అన్షు మాలిక్, సోనమ్ మాలిక్, సీమా బిస్లాతో కలిసి ఉండేందుకు వినేష్ నిరాకరించింది. వారు భారత్ నుంచి వచ్చారు కనుక వారితో కలిసి ఉండి ప్రాక్టీస్ చేస్తే కరోనా సోకే అవకాశముందని ఆక్షేపించింది. దీంతో, తాజాగా టోక్యో నుంచి వచ్చిన వినేష్ ఫొగాట్ కు డబ్ల్యూఎఫ్ఐ నోటీసులు జారీ చేసింది.
యువ రెజ్లర్ సోనమ్ అనుచిత ప్రవర్తన కారణంగా ఆమెకు కూడా డబ్ల్యూఎఫ్ఐ నోటీసులు జారీ చేసింది. ఈ ఆరోపణలపై వినేష్ వివరణ సంతృప్తికరంగా లేకుంటే ఆమెపై దీర్ఘకాలం నిషేధం విధించే అవకాశం ఉంది. తాజా ఎపిసోడ్ తో ఆటతీరుతో పాటు మాటతీరుతోనూ వినేష్ ఫొగాట్ నిరాశపరిచిందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.
This post was last modified on August 11, 2021 12:12 pm
రాజకీయ ప్రవేశం చేశాక తన చివరి సినిమాగా విజయ్ చేస్తున్న తలపతి 69కి 'జన నాయగన్' టైటిల్ ని ఖరారు…
భారత యువ క్రికెటర్ తిలక్ వర్మ మరోసారి తన అద్భుతమైన ఆటతీరుతో అందరి ప్రశంసలను అందుకున్నాడు. ఇంగ్లాండ్తో రెండో టీ20…
ధమాకా తర్వాత రవితేజ రియల్ మాస్ మళ్ళీ తెరమీద కనిపించలేదు. వాల్తేరు వీరయ్య సంతృప్తి పరిచింది కానీ అది చిరంజీవి…
అమెజాన్ లాంటి సంస్థలు జారీ చేస్తున్న గిఫ్ట్ కార్డుల్లో లెక్కలేనన్ని మోసాలు జరుగుతున్నాయి. ముందుగానే రుసుము చెల్లించి గిఫ్ట్ కార్డులు తీసుకుంటే... ఏదో…
దేవర 1 కి మొదట వచ్చిన టాక్ తో ఎక్కడ డిజాస్టర్ అవుతుందో అని మేకర్స్ కాస్త కంగారు పడ్డారు.…
ఏపీలో వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసం, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనాామా గోల ఇక ముగిసినట్టే. సాయిరెడ్డి సన్యాసాన్ని…