జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు క్యూ కడుతున్నారు. ఆర్టికల్ 376 ను నరేంద్రమోడి సర్కార్ రద్దు చేయటంతో పరిశ్రమల ఏర్పాటుకు చాలామంది ఆసక్తిగా ఉన్నారు. 24 గంటలూ, 365 రోజులూ జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలో బాంబుల మోతలు, తుపాకల గర్జనలు మాత్రమే వినిపిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు తీవ్రవాదులకు అడ్డాలుగా మారిపోయాయి. దాంతో రెగ్యులర్ పోలీసులకన్నా మిలిట్రీ వాళ్ళే ఎక్కడ చూసినా కనబడుతుంటారు.
ఏ నిముషంలో ఎక్కడ బాంబులు పేలుతాయో ? ఏ తీవ్రవాద గ్రూపు తుపాకీలు పేలుస్తాయో ఎవరు చెప్పలేరు. ఇలాంటి పరిస్దితుల నుండి రాష్ట్రాన్ని బయటపడేయాలనే కేంద్రం జమ్మూ-కాశ్మీర్ కు మాత్రమే ప్రత్యేకంగా ఉన్న ఆర్టికల్ 376ను రద్దుచేసేసింది. దీంతో ముందు రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానించి పరిశ్రమలు ఏర్పాటు చేయటం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించటం ద్వారా యువతను తీవ్రవాదం నుండి మళ్ళించాలని కేంద్రం ప్లాన్ వేసింది.
ఇందులో భాగంగానే ఆసక్తున్న పరిశ్రామికవేత్తలకు అవసరమైన భూములను కేటాయిస్తున్నారు. ఇందులో భాగంగానే కొన్ని కాల్ సెంటర్లు ఏర్పాటయ్యాయట. అలాగే పండ్ల తోటల పెంపకం, ఫ్రూట్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు కొందరు పారిశ్రామికవేత్తలు ఆసక్తిగా చూపుతున్నారట. జమ్మూలో రు. 12 వేల కోట్లు, కాశ్మీర్లో రు. 13 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయట.
కొన్ని దశాబ్దాల తర్వాత ఇన్ని వేల కోట్ల రూపాయలు రావటంతో రాష్ట్రప్రభుత్వోద్యోగులతో పాటు స్ధానికులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తంచేస్తున్నారట. వచ్చే ఏడాది మార్చినాటికి మరో రు. 50 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అధికారయంత్రాంగం అంచనా వేస్తున్నది. ఫ్రూట్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటవుతున్న కారణంగా ఆపిల్, ప్లమ్, చెర్రీ, ఆప్రికాట్, బాదం తోటల పెంపకానికి రైతులు రెడీ అవుతున్నారట. ఇక్కడ వాతావరణం మంచుతో కూడుకున్నది కావటంతో గొఱ్ఱెల పెంపకంపైన కూడా స్ధానికులు దృష్టి పెడుతున్నారు.
స్వదేశీ పారిశ్రామికవేత్తల నుండే కాకుండా విదేశాల్లోని పారిశ్రామికవేత్తల నుండి కూడా ఎక్కువ ఎంక్వైరీలు వస్తున్నాయట. విదేశీ పారిశ్రామికవేత్తలకు అడ్వాంటేజ్ ఏమిటంటే వాతావరణం కలిసిరావటం. యూరోపు దేశాల్లో ఎంత చల్లగా ఉంటుందో జమ్మూ-కాశ్మీర్ కూడా అంతకన్నా చల్లగా ఉంటుంది. కాబట్టే విదేశీ సంస్ధలు ఎక్కువ దృష్టిపెడుతున్నాయట. పరిశ్రమలను ప్రత్సహించటం కోసం ఎలాగూ కేంద్రం భారీగా ప్రోత్సాహకాలిస్తుంది. కాబట్టి ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని విదేశాలు యోచిస్తున్నాయట. సరే కారణం ఏదైనా జమ్మూ-కాశ్మీర్ కు పూర్వవైభవం వస్తే అంతే చాలు.
This post was last modified on August 10, 2021 12:24 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…