భారత్ 41ఏళ్ల కల నెరవేరింది. టోక్యో ఒలంపిక్స్ లో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. భారత హాకీ జట్టు కాంస్య పతకం గెలిచింది. ఈ పతకం కోసం భారత్ దాదాపు 41ఏళ్ల నుంచి ఎదురుచూస్తుండటం గమనార్హం.
సెమీస్‌లో ఓడిన హాకీ జట్టు.. కాంస్య కోసం జరిగిన పోరులో మాత్రం అదరొట్టింది. జర్మనీపై 4-5 తేడాతో విజయం సాధించింది. మొదట జర్మనీ జట్టు దూకుడు ప్రదర్శిస్తూ.. భారత్‌పై ఆధిపత్యం సాధిస్తున్నట్లు కనిపించింది. తొలి గోల్ జర్మనీయే సాధించింది. ఆ తర్వాత భారత ఆటగాడు సమర్ జిత్ గోల్ కొట్టి సమం చేశాడు.
అనంతరం జర్మనీ జట్టు వరుసగా రెండు గోల్స్ సాధించడంతో 3-1 తేడాతో ఇండియన్ టీమ్ వెనకబడిపోయింది. ఐతే ఆ తర్వాత మనోళ్లు చెలరేగిపోయారు. వరుసగా నాలుగు గోల్స్ కొట్టారు. హార్ధిక్ సింగ్, హర్మన్‌ప్రీత్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్, సమర్ జిత్ సింగ్ గోల్ కొట్టడంతో 3-5 లీడింగ్‌లోకి వెళ్లిపోయింది భారత్. అనంతరం జర్మనీ మరో గోల్ కొట్టినా.. 4-5 తేడాతో ఇండియా గెలిచింది.
మొదటి క్వార్టర్ ముగిసే సరికి జర్మనీ 1-0 లీడింగ్‌లో ఉంది. రెండో క్వార్టర్‌లో భారత్ అద్భుతంగా పుంజుకుంది. జర్మనీ మరో 2 గోల్స్, భారత్ మూడు గోల్స్ సాధించడంతో 3-3తో స్కోర్లు సమయం అయ్యాయి. మూడో క్వార్టర్లో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. రెండు గోల్స్ సాధించి 3-5 లీడింగ్‌లోకి వెళ్లిపోయింది. ఐతే నాలుగో క్వార్టర్‌లో జర్మనీ ఒక గోల్ సాధించడంతో భారత్ లీడింగ్ కాస్త తగ్గింది. ఐనా 4-5 తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో సమర్ జిత్ రెండు గోల్స్ సాధించి భాారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
This post was last modified on August 5, 2021 9:42 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…