బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు.. ఒలంపిక్స్ లో అదరగొట్టారు. రియో ఒలంపిక్స్ లో సిల్వర్ పతకం గెలిచిన సింధు.. టోక్యో ఒలంపిక్స్ లో కాంస్యం గెలిచింది. దీంతో.. ఆమెకు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. ఆమె వరసగా రెండు ఒలంపిక్స్ లో.. పతకం సాధించి రికార్డు కూడా క్రియేట్ చేశారు.
దీంతో.. దేశ ప్రజలు.. చాలా మంది సింధు గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారు. గూగుల్ లో సింధు గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే.. ఎక్కువ మంది కామన్ గా అడిగిన ఓ ప్రశ్న.. తీవ్ర చర్చనీయాంశమైంది. దేశానికి గర్వ కారణంగా నిలిచిన అమ్మాయి గురించి ఇలా వెతుకుతున్నారా అంటూ పలువురు విమర్శిస్తున్నారు.
గూగుల్‌లో పీవీ సింధుపీవీ సింధు జన్మించింది ఎక్కడ? ఎక్కడ ట్రైనింగ్ తీసుకుంది? ఎంత చదువుకుంది? అనే వివరాలను సెర్చ్ చేయడం కామనే. కానీ, కొంత మంది ఆమె సామాజిక వర్గం ఏంటి? అని సెర్చ్ చేశారు. కాంస్య పతకం సాధించిన వెంటనే సెర్చ్ ఇంజిన్‌లో ఇలాంటి ప్రశ్నలను సంధించి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు కొందరు. చాలా మంది నెటిజనాలు ఇలా చేయడం చూస్తుంటే వారి మెదళ్లలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో? మనం అర్థం చేసుకోవచ్చు.
విచిత్రం ఏమిటంటే.. సింధు రియో ఒలంపిక్స్ లో సిల్వర్ మెడల్ గెలిచిన సమయంలోనూ.. ఇలాంటి ప్రశ్నలే వెతకడమే గమనార్హం.
This post was last modified on August 4, 2021 6:58 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…