టోక్యో ఒలంపిక్స్ లో పీవీ సింధు అదరగొట్టింది. బంగారు పతకం సాధిస్తుందని అందరూ ఆశపడ్డారు. తాను కూడా బంగారు పతకం సాధించడం కోసం చాలా కష్టపడింది. కానీ.. సెమిస్ చేజారడంతో.. తర్వాతి మ్యాచ్ గెలిచి.. కాంస్యం సాధించింది. దేశానికి పతకం సాధించి.. దేశ గౌరవాన్ని మరింత పెంచింది.
ఈ క్రమంలోనే సింధును యావత్ భారత దేశం కొనియాడుతోంది. అందరి నుంచి ఆమెకు అభినందనలు వస్తున్నాయి. ఇక ఇది వరకే ఆమె సిల్వర్ మెడల్ సాధించింది. దీంతో రెండు ఒలంపిక్ మెడల్స్ ను సాధించిన తొలి భారతీయ మహిళగా సింధు రికార్డు సృష్టించింది.
ఈ ఒలంపిక్స్ లో కాంస్యం గెలిచిన సింధుకి… కారు బహుమతి ఇవ్వాలంటూ ఆనంద్ మహీంద్రాను ఓ నెటిజన్ డిమాండ్ చేయడం గమనార్హం. కాగా.. ఆ నెటిజన్ డిమాండ్ కి ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు.
గత ఒలంపిక్స్ సమయంలోనే తనకు కారు బహుమతిగా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పీవీ సింధు గ్యారేజ్‌లో ఇప్పటికే ఒక థార్ వాహనం ఉందని ఆనంద్ మహీంద్రా అన్నారు. ఇక దీంతోపాటు ఆయన సింధును పొగడ్తల్లో ముంచెత్తారు. ఆమెకు కాంస్య పతకం వచ్చినా ఆమె చేసిన కృషి అద్భుతమని, ఆమెకు బంగారు పతకం వచ్చినట్లుగానే తాను భావిస్తున్నానని తెలిపారు. ఒలంపిక్స్ లో మెడల్ సాధించడం అంత ఆషామాషీ కాదన్నారు.
కాగా 2016లో బ్రెజిల్ రాజధాని రియోలో నిర్వహించిన ఒలంపిక్స్ లో సింధుకు సిల్వర్ మెడల్ వచ్చింది. అలాగే రెజ్లర్ సాక్షి మాలిక్‌కు కాంస్య పతకం వచ్చింది. దీంతో అప్పట్లో ఆనంద్ మహీంద్రా ఆ ఇద్దరికి చెరొక థార్‌ను బహుమతిగా ఇచ్చారు. అదే విషయాన్ని ఆయన తాజాగా తెలిపారు.
This post was last modified on August 2, 2021 7:03 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…