టోక్యో ఒలంపిక్స్ లో భారత షట్లర్ పీవీ సింధు.. దూసుకెళుతోంది. వరస విజయాలతో తన పరంపర కొనసాగిస్తోంది. ఫ్రీ క్వార్టర్స్‌లో మళ్లీ ప్రత్యర్థిని చిత్తు చేశారామె. డెన్మార్క్ షెట్లర్ బ్లిక్ ఫెల్ట్ తో జరిగిన మ్యాచ్‌లో ప్రారంభం నుంచి ఆధిపత్యం చూపించారు. 21-15,21-13తో బ్లిక్ ఫెల్ట్ పై విజయం సాధించారు. ఈ మ్యాచ్‌కు ముందు వీరిద్దరూ 5సార్లు తలపడ్డారు. నాలుగుసార్లు పీవీ సింధునే గెలిచారు. వరుసగా మూడు విజయాలతో పీవీ సింధు గ్రూప్ జేలో తొలిస్థానంలో ఉన్నారు.
బుధవారం జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఘన విజయం సాధించారు. గ్రూప్ దశ మ్యాచ్‌లో చెంగ్ యీపై 21-6, 21-16 తేడాతో సింధు గెలుపొందారు. నాలుగు రోజుల క్రితం జరిగిన గ్రూప్ జె తొలి మ్యాచ్‌లోనూ ఆమె విజయం సాధించారు. ఇజ్రాయిల్ షట్లర్ సెనియా పొలికర్ పోవ్‌పై సింధు విజయం సాధించి ఒలింపిక్స్‌లో బోణీ కొట్టారు.
గత ఒలింపిక్స్‌లో కొంచెంలో స్వర్ణం దక్కలేదు. ఇప్పుడు స్వర్ణం కోసం సింధు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. మ్యాచ్ ప్రారంభం నుంచి ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు బ్యాట్‌కు పనిచెబుతున్నారు. ఎలాగైనా సరే ఈ సారి గోల్డ్ మెడల్‌ను వదులుకునే ఛాన్స్ ఇవ్వనని ఆమె అంటున్నారు.
This post was last modified on July 29, 2021 10:16 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…