టోక్యో ఒలంపిక్స్ సందడిగా జరుగుతున్నాయి. మన దేశ గౌరవాన్ని కాపాడేందుకు క్రీడాకారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కాగా.. ఇటీవల వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ కి రజతం దక్కిన సంగతి తెలిసిందే. రజతం దక్కిందని ఆనందపడినా.. గోల్డ్ మిస్ అయ్యిందే అని చాలామంది నిరుత్సాహపడ్డారు.
అయితే.. ఇప్పుడు ఆ చేజారిన స్వర్ణం మళ్లీ మన దేశానికి దక్కే అవకాశం కనిపిస్తోంది. వెయిట్ లిఫ్టింగ్ లో మన ఇండియా కు చెందిన క్రీడాకారిణి మీరాబాయి చాను వెండి పతకం గెలవగా… చైనా వెయిట్ లిఫ్టర్ జీహూహో స్వర్ణం గెలుచుకుంది. అయితే.. ఈ చైనా క్రీడాకారిణి జీహూహో ను డోపింగ్ టెస్టుకు పంపాలని ఒలంపిక్స్ నిర్వాహకులు భావిస్తున్నారు.
ఒకవేళ నిజంగానే ఆ చైనా క్రీడాకారిణిని డోపింగ్ టెస్ట్ కు పంపితే… ఆర్ టెస్టులో ఆమె పాజిటివ్గా తేలితే బంగారు పథకం మీరా భాయ్ కి వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. డోపింగ్ టెస్ట్ చేసేందుకు జిహూహోను టోక్యో లోనే ఉండాలని ఇప్పటికే నిర్వాహకులు ఆదేశాలు జారీ చేశారు. కాగా భారత వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారిణి మీరాబాయి చాను చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. 49 కేజీల విభాగంలో జరిగిన ఒలంపిక్స్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఆమె సిల్వర్ మెడల్‌ను సాధించింది.
This post was last modified on July 26, 2021 3:51 pm
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…