Trends

సెప్టెంబర్ నుంచి చిన్నారులకు వ్యాక్సిన్..!

భారత్ లో కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటి వరకు 18ఏళ్లు నిండిన వారికి మాత్రమే వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. దీంతో.. చిన్నారులకు ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా గుడ్ న్యూస్ తెలియజేశారు.

భారత్‌లో పిల్లలకు కరోనా వ్యాక్సిన్‌లు సెప్టెంబర్‌ నుండి ఆందుబాటులోకి రావచ్చని ఎయిమ్స్‌ చీఫ్‌ రణదీప్‌ గులేరియా పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు ఇది అతి ముఖ్యమైన చర్య అని జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. జైడస్‌ చిన్నారులపై ట్రయల్స్‌ నిర్వహించిందని, అత్యవసర అనుమతుల కోసం వేచిచూస్తుందని అన్నారు. భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ ట్రయల్స్‌ ఆగస్టు, సెప్టెంబర్‌లోపు పూర్తవుతాయని, వెంటనే అనుమతులు పొందవచ్చని అన్నారు.

అమెరికాకు చెందిన ఫైజర్‌ వ్యాక్సిన్‌ను ఇప్పటికే ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డిఎ) ఆమోదించిందని చెప్పారు. దీంతో సెప్టెంబర్‌ నుండి చిన్నారులకు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించవచ్చని భావిస్తున్నామని అన్నారు. దేశంలో ఇప్పటివరకు 42 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్‌లను అందించామని, ఈ ఏడాది చివరి నాటికి పెద్దలందరికీ వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు.

అయితే థర్డ్‌వేవ్‌ చిన్నారులపై ప్రభావం చూపుతుందన్న వార్తల నేపథ్యంలో.. చిన్నారులకు వ్యాక్సిన్‌లను అందించడంపై స్పష్టతనివ్వలేదు. 11-17 ఏళ్లలోపు పిల్లలతో కలిసి జీవించే వృద్ధుల్లో వ్యాధి సోకే ప్రమాదం 18-30 శాతం పెరుగుతోందని ఈ వారం ప్రారంభంలో లాన్సెట్‌ ఒక అధ్యయనాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గులేరియా స్పందిస్తూ.. వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వ్యాధి సొకే ప్రమాదం అధికంగా ఉందని అన్నారు.

చిన్నారులను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు నిరాకరించడానికి ఇది కూడా ఒక కారణమని అన్నారు. స్వల్పంగా వ్యాధి సోకిన చిన్నారులు వృద్ధులకు వ్యాప్తి చేయవచ్చని .. అయితే దీనిపై మరింత అధ్యయనం అవసరమని చెప్పారు.

This post was last modified on July 24, 2021 6:00 pm

Share

Recent Posts

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

42 minutes ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

4 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

5 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

6 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

12 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

14 hours ago