క్రికెట్ లో మీరు ఎన్నో రికార్డుల గురించి విని ఉంటారు. కానీ..ఇది అన్నింటికన్నా.. పరమ చెత్త రికార్డు కావడం గమనార్హం. కేవలం ఏడు పరుగులకే ఓ జట్టు మొత్తం అవుట్ కావడం గమనార్హం.
పూర్తి వివరాల్లోకెళితే.. యార్క్‌షైర్ ప్రీమియర్ టీ10 లీగ్‌లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్‌లో అత్యంత రికార్డ్ నమోదయ్యాయి. ఈస్ట్‌రింగ్‌స్టన్ క్లబ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో.. హిల్లమ్ మాన్క్ ఫ్రైస్టన్ జట్టు 8 ఓవర్లలో 7 పరుగులకే ఆలౌటై అప్రతిష్ట మూటగట్టుకుంది. అనంతరం స్వల్ప ఛేదనలో ప్రత్యర్ధి జట్టు కేవలం 8 బంతుల్లోనే వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని చేరుకుని 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
దీంతో ఈ మ్యాచ్.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో, అత్యంత తక్కువ బంతుల్లో పూర్తయిన మ్యాచ్‌గా చరిత్రలో నిలిచింది. ఈ మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌లు కేవలం 56 బంతుల్లోనే ముగిసిపోయాయి.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన హిల్లమ్ మాన్క్ ఫ్రైస్టన్ జట్టు.. డ్రెస్సింగ్ రూమ్‌లో ఏదో పని ఉందన్నట్లుగా క్రీజులోకి వచ్చీరాగానే వికెట్లు సమర్పించుకుని పెవిలియన్‌కు చేరారు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 10మంది బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ చేయగా, 8 మంది ఖాతా తెరవకుండానే ఔటయ్యారు. మిగిలిప ఇద్దరు ఆటగాళ్లు అతికష్టం మీద తలో రెండు పరుగులు చేయగా, మిగిలిన మూడు పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో వచ్చాయి. దీంతో ఫ్రైస్టన్ జట్టు 8 ఓవర్లలో 7 పరుగులకు ఆలౌటైంది. ప్రత్యర్ధి బౌలర్ నాథన్ క్రీగర్ 4 ఓవర్లలో 3 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు.
ఆ తర్వాత 8 పరుగులు స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్‌రింగ్‌స్టన్ జట్టు.. కేవలం 1.2 ఓవర్లలో వికెట్లు నష్టపోకుండా టార్గెట్‌ను రీచ్ కావడంతో ఏ ఫార్మాట్టోనైనా అత్యంత తక్కువ సమయంలో, అత్యంత తక్కువ బంతుల్లో ముగిసిన మ్యాచ్‌గా ఈ మ్యాచ్ చరిత్రకెక్కింది. ఈస్ట్‌రింగ్‌స్టన్ ఆటగాడు జేమ్స్ ఒక్కడే 8 బంతులను ఎదుర్కొని బౌండరీ సాయంతో 7 పరుగులు సాధించాడు. మరో పరుగు ఎక్స్‌ట్రాగా లభించింది. మరోవైపు ఈ మ్యాచ్ పై క్రికెట్ ఫ్యాన్స్ పెదవి విరుస్తున్నారు. మీ కన్నా గల్లీ క్రికెటర్లు నయం అంటూ కామెంట్లు చేస్తున్నారు.
This post was last modified on July 12, 2021 3:47 pm
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…
మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…