Trends

అన్ని కరోనా వేరియంట్స్ కి ఒకటే సూపర్ వ్యాక్సిన్..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి సృష్టించిన విలయతాండవం అంతా ఇంతా కాదు.. వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో… దీనికి మందు కనిపెట్టాలని.. శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి మరీ.. కొన్ని రకాల వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. అయినప్పటికీ… ఈ మహమ్మారి అంతమౌతుందనే గ్యారెంటీ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే.. ఇలా ఈ మహమ్మారి కాస్త తగ్గిపోయిందిలే అనుకొని ఊపిరి పీల్చుకునేలోపు.. మళ్లీ కొత్త వేరియంట్ పుట్టుకొస్తోంది. దీంతో.. ఆ కొత్త రకం వేరియంట్లను ఎదుర్కోవడం అందరికీ సవాలుగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ సూపర్ న్యూస్ ని నిపుణులు మనకు అందజేశారు.

కరోనా కార‌ణంగా భవిష్యత్తులో వచ్చే అంటువ్యాధుల నుంచి రక్షణ అందించ‌గ‌ల సూపర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఈ టీకాను ఇప్ప‌టికే ఎలుకలపై విజయవంతంగా ప్ర‌యోగించారు. ఈ టీకాను అమెరికాలోని నార్త్ కరోలినా విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసింది. దీనికి సంబంధించిన వివ‌రాల‌ను విశ్వవిద్యాలయ ఆధ్వ‌ర్యంలో న‌డిచే సైన్స్ పత్రికలో ప్రచురించారు.

శాస్త్రవేత్తలు ఈ ఆవిష్కరణను రెండవతరం టీకాగా వర్ణించారు. శాస్త్రవేత్తలు తెలిపిన వివ‌రాల‌ ప్రకారం ఈ టీకా కోవిడ్ -19 తో పాటు కరోనా వైరస్ కుటుంబంలోని అన్ని ప్రమాదకరమైన వైరస్‌ల‌తో పోరాడటానికి సహాయ పడుతుంది. వచ్చే ఏడాది నాటికి ఈ టీకాను మ‌నుషుల‌పై పరీక్షించాలని శాస్త్రవేత్తలు నిర్ణ‌యించారు. కరోనా వైరస్‌లోని కొత్త వేరియంట్లు భవిష్యత్తులో కొత్త అంటువ్యాధుల‌కు దారి తీసే అవ‌కాశ‌ముంద‌ని, అలాంటి ప్రమాదాన్ని నివారించడానికే ఈ టీకాను రూపొందిస్తున్నామ‌ని శాస్త్రవేత్త‌లు తెలిపారు.

ఎలుకలపై చేసిన పరీక్షల్లో ఈ టీకా ప్రతిరోధకాలను సృష్టించింది. ఇవి స్పైక్ ప్రోటీన్‌కు వ్యతిరేకంగా కూడా ప్రభావవంతంగా ఉంటాయి. ఈ టీకా దక్షిణాఫ్రికాలో కనిపించిన బీ.1.351 వేరియంట్‌పై కూడా ప్రభావాన్ని చూపించింది. కరోనా వైరస్ బయటి ఉపరితలంపై ముల్లు లాంటి భాగం నుంచి వైరస్ ప్రోటీన్ విడుదలవుతుంది. దీనిని స్పైక్ ప్రోటీన్ అంటారు.ఈ ప్రోటీన్‌తో ఇన్‌ఫెక్షన్ ప్రారంభమవుతుంది. ఇది మానవ ఎంజైమ్ ఏసీఈ2 రిస్పెక్ట‌ర్‌తో జ‌త‌క‌ట్ట‌డం ద్వారా ఊపిరితిత్తులకు చేరుకుంటుంది. త‌ద్వారా వ్యాధి వ్యాప్తి చెందుతుంది.

This post was last modified on June 24, 2021 9:00 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెండు దశాబ్దాల తర్వాత ఆరు జోడి

ఇటీవలే కంగువ ఇచ్చిన షాక్ నుంచి సూర్య కోలుకున్నాడో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమాని వీలైనంత…

32 mins ago

ప్ర‌జ‌ల‌ను పాత రోజుల్లోకి తీసుకెళ్తున్న చంద్ర‌బాబు!

అదేంటి.. అనుకుంటున్నారా? ప్ర‌పంచం మొత్తం ముందుకు సాగుతుంటే చంద్ర‌బాబు వెన‌క్కి తీసుకువె ళ్లడం ఏంటి? అని విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారా?…

2 hours ago

విశ్వక్సేన్.. ప్రమోషన్ల మాస్టర్

ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరువ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది.…

3 hours ago

పోసాని తెలివిగా గుడ్ బై చెప్పేశారు

వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై సినీ నటుడు,వైసీపీ నేత పోసాని కృష్ణ ముురళి సంచలన వ్యాఖ్యలు చేసిన…

3 hours ago

ఏఆర్ రెహమాన్.. బ్యాడ్ న్యూస్ తరువాత గుడ్ న్యూస్

భారతీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి గాను ఉత్తమ…

3 hours ago