మన దగ్గర ఓ కాఫీ ప్యాకెట్ ధర ఎంత ఉంటుంది..? మహా అయితే.. రూ.100 లేదంటే.. రూ.200 ఉంటుంది కదా.. కానీ.. ఉత్తర కొరియాలో మాత్రం.. కేవలం ఒక్క కాఫీ ప్యాకెట్ ధర రూ.7వేలపైనే. అదొక్కటే కాదు.. అక్కడ టీ పొడి.. అరటి పండ్లు.. ఇలా ప్రతి ఒక్క దాని ధర రూ.వేలల్లోనే ఉంది.
అవి అంత కాస్ట్ లీ అంటే.. వాటిలో ఏదైనా స్పెషాలిటీ ఉందని పొరపాటు పడకండి. ఎందుకంటే.. వాటిలో ఎలాంటి స్పెషాలిటీ లేదు. కరోనా కారణంగా.. అక్కడ ఏర్పడిన పరిస్థితుల వల్ల ధరలు ఆకాశాన్నంటాయి. అక్కడ కనీసం తినడానికి కూడా తిండి దొరకక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే కొన్ని ఆహార పదార్థాల ధరలు.. ఇదిగో ఇలా ఆకాశాన్నంటేలా ఉన్నాయి.
ఉత్తర కొరియాలో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడింది. ఒక్కసారిగా ఆ దేశంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. టీ, కాఫీ పొడి ధరలు కూడా సామాన్యులకు అందనంత పైకి ఎగబాకాయి. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో అయితే పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది.
కిలో అరటి పండ్లు కావాలంటే 45 డాలర్లు అంటే భారత కరెన్సీలో చెప్పాలంటే రూ.3300గా ఉంది. ఒక కాఫీ ప్యాకెట్ 100 డాలర్లు (రూ.7400) పలుకుతోంటే.. బ్లాక్ టీ ప్యాకెట్ కోసం 70 డాలర్లు (రూ. 5,190) ఖర్చు పెట్టాల్సి వస్తోంది. దీంతో కనీస అవసరాలు తీర్చుకోలేక ఉత్తర కొరియా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కరోనా కారణంగా ఉత్తర కొరియా తమ దేశ సరిహద్దులను మూసివేసింది. దీనికి తోడు కొన్నాళ్ల క్రితం భారీ వర్షాలు, వరదల కారణంగా ఆహార పంటలు దెబ్బతిన్నాయి. దాదాపు 8 లక్షల టన్నుల దిగుబడి వచ్చే ఆహార పంటలు కొట్టుకపోయాయి. దీంతో తక్షణం ఆహారోత్పత్తిని పెంచే మార్గాలపై కిమ్ ప్రభుత్వం దృష్టి పెట్టింది.
This post was last modified on June 22, 2021 8:44 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…