ప్రస్తుత కాలంలో ఏదైనా వస్తువు పోయిందీ అంటే… మళ్లీ దొరకడం కష్టం. ఇక అది విలువైనది అయితే… ఇక దాని మీద ఆశలు వదులుకోవాల్సిందే. కానీ.. ఓ మహిళకు 46ఏళ్ల క్రితం పొరపాటుగా పోగొట్టుకున్న ఉంగరం సోషల్ మీడియా పుణ్యమా అని.. మళ్లీ దక్కించుకుంది. అందుకే.. తన ఆనందాన్ని ఎలా తెలియజేయాలో అర్థంకాక సోషల్ మీడియాకి థ్యాంక్స్ చెప్పింది. ఈ సంఘటన అమెరికాలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మిచిగాన్ ప్రాంతానికి చెందిన మేరీ గజల్ అనే మహిళ.. 1975 లో అనుకోకుండా తన ఉంగరాన్ని పోగొట్టుకుంది. మళ్లీ ఆ ఉంగరం దొరుకుతుందని ఆమె అస్సలు ఊహించలేదు. ఆ ఉంగరం పోయిందని చాలా బాధపడింది. కానీ.. ఇటీవల ఆమెకు ఫేస్ బుక్ లో వచ్చిన ఓ మెసేజ్ చూసిన తర్వాత ఆమెకు పోయిన ప్రాణం మళ్లీ దొరికినట్లు అనిపించింది.
ఎందుకంటే.. ఆమె 46ఏళ్ల క్రితం పోగొట్టుకున్న ఉంగరం తిరిగి ఇవ్వాలని అనుకుంటన్నట్లు క్రిస్ నార్డ్ అనే మహిళ ఆమెకు మెసేజ్ చేసింది. అది చూసి ఆమె ఆనందంతో పొంగిపోయింది. ముందు అసలు ఆ మెసేజ్ చూసి ఆమె షాక్ అయ్యింది.
‘ మీకు సంబంధించిన ఓ వస్తువు నా దగ్గర ఉంది’ అంటూ మెసేజ్ రావడం చూసి షాకైంది. ముందుగా అది ఏదైనా స్పామ్ ఏమో అని అనుకుంది. కానీ.. తర్వాత ఓపెన్ చేసిన తర్వాత స్పామ్ కాదని తెలిసింది.
నార్డ్ అనే మహిళ ఓ ఫేస్ బుక్ పేజీలో ఈ ఉంగరం ఎవరిదో ఎవరికైనా తెలుసా అని పోస్టు చేసింది. దానిని మిగిలిన వాళ్లు చాలా మంది షేర్ చేయడంతో.. చివరకు మేరీది అని తెలిసింది. దీంతో.. ఆమెకు పర్సనల్ గా మెసేజ్ చేసి ఉంగరాన్ని అందించారు.
చివరకు.. 46ఏళ్ల క్రితం పోగొట్టుకున్న ఉంగరం తిరిగి ఆమెకు దక్కింది. దీంతో.. ఆమె తన ఉంగరం దక్కడానికి కారణమైన సోషల్ మీడియాకు దన్యావాదాలు తెలియజేశారు.
This post was last modified on June 11, 2021 4:21 pm
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎన్నికల సమయంలో ఎలాంటి మాటలు చె ప్పినా.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు…