ప్రపంచంలో కెల్లా అత్యంత ధైర్యవంతుడు.. ఎవరు అంటే.. మీరు ఎవరి పేరు చెబుతారు..? ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మని అడిగితే మాత్రం.. దుబాయికి చెందిన ఓ ముసలాయను చూపిస్తున్నాడు. అంత ధైర్యవంతమైన పని ఆయన ఏం చేశాడో తెలుసా..? 37వ సారి పెళ్లి చేసుకున్నాడు. అది కూడా తన 28 మంది భార్యలు చూస్తుండగానే. అంతే కదా.. భార్య కళ్ల ముందు మరో అమ్మాయిని చూస్తూనే ఊరు కోరు అలాంటిది.. ఇతను ఏకంగా ఇన్ని పెళ్లిళ్లు చేసుకోవడం అంటే సాహసమే.
ఇంతకీ మ్యాటరేంటంటే…
దుబాయికి చెందిన ఓ వ్యక్తి 37 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అది కూడా 28మంది భార్యల మధ్యలో వారిని పెళ్లి చేసుకోవడం గమనార్హం. ఈ వివాహ కార్యక్రమంలో అతడి 135 మంది పిల్లలు, 126 మనవళ్లు, మనవరాళ్లు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన 45 సెకన్ల నిడివి కలిగిన ఓ వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఒక్క పెళ్లి చేసుకుందామంటేనే పిల్ల దొరకడం లేదు అంతమంది నీకు ఎలా దొరికారాని కొందరు అంటే.. భార్యలతో ఆయన ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడని ఓ యూజర్ వ్యాఖ్యానించాడు. ఒక్క పెళ్లాంతోనే వేగలేకపోతున్నాం.. ఇంత మందిని ఎలా భరిస్తున్నావు స్వామీ అంటూ కొందరు కామెంట్స్ పెట్టడం గమనార్హం. అసలు అంతమందిని ఆయనను పెళ్లి చేసుకోవడానికి ఎలా అంగీకరించారంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on June 10, 2021 4:55 pm
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి…
అలియా భట్ ఎలా అన్ని బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తుందో చూసి చాలామందికి ఆశ్చర్యమే. కొత్త ఇల్లు, సినిమాలు, బిజినెస్ పనులు,…
రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న మోహన్ లాల్ ప్యాన్ ఇండియా మూవీ వృషభ డిసెంబర్ 25 మళయాళంతో పాటు తెలుగులోనూ సమాంతరంగా…
శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…
ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…
నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…