ఒక కాన్పులో ఎంతమందిని కనే అవకాశం ఉంది.. మహా అయితే ముగ్గురు.. లేదంటే ఐదుగురు.. కాదంటే ఆరుగురు.. అంతకు మించి మనసు ఆలోచించటానికి కూడా ముందుకు వెళ్లదు. అలాంటిది ఒక కాన్పులో ఒకరికి తక్కువగా క్రికెట్ టీంను కనేయటం అన్న ఊహే వణుకు పుట్టిస్తుంటుంది. తాజాగా అదే నిజమైంది. ఒకే కాన్పులో పది మందికి జన్మనిచ్చిందో ‘మహా తల్లి’. ఇప్పుడీ ఉదంతం వైరల్ గా మాత్రమే కాదు.. ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆమె ఎక్కడి వారు.. ఆమె భర్త ఏం చేస్తుంటారు? అన్న వివరాల్లోకి వెళితే..
దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా నగరానికి చెందిన గోసియమి తమారా సితోలే అనే 37 ఏళ్ల మహిళ ఆ మధ్యన గర్భవతి అయ్యింది. రోటీన్ కు భిన్నంగా ఆమెలో లక్షణాలు కనిపించాయి. ఊపిరి తీసుకోవటం కూడా కష్టంగా ఉండేది. ఆమె భర్త రిటైల్ స్టోర్ మేనేజర్ గా పని చేస్తుంటారు. వారికి ఇప్పటికే ఇద్దరు కవలలు ఉన్నారు. వారికి ఆరేళ్లు.
తాజా ప్రెగ్నెంట్ ఆమెకు ఇబ్బందికరంగా ఉండడటంతో వైద్యుల్ని సంప్రదించారు. డాక్టర్లు తీసిన స్కానింగ్ లో ఆమెకు ఆరుగురు కవలలు పుడుతున్నట్లు చెప్పారు. తర్వాత అనుమానం వచ్చి మళ్లీ స్కానింగ్ తీసి.. ఎనిమిది మంది కవలలు పుట్టనున్నట్లు చెప్పారు. తాజాగా ఆమెకు డెలివరీ అయ్యింది. వైద్యుల అంచనాలకు భిన్నంగా ఆమె మొత్తం పది మందికి ఒకే కాన్పులో జన్మనిచ్చింది. ప్రపంచ రికార్డును నెలకొల్పింది.
ఒకే కాన్పులో అత్యధికంగా తొమ్మిది మందికి జన్మనిచ్చిన వైనం ఇప్పటి వరకు ప్రపంచ రికార్డుగా ఉండేది. గత నెలలోనే మొరాకోకు చెందిన మహిళ ఒకే కాన్పులో తొమ్మిది మందికి జన్మనిచ్చి.. ప్రపంచ రికార్డును నెలకొల్పగా.. నెల తిరగకుండానే ఆ రికార్డును చెరిపేసి..ఒకరికి తక్కువగా క్రికెట్ టీంను కనేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రపంచ రికార్డు మాటేమో కానీ.. ఒకేసారి పది మంది పిల్లల్ని చూసుకోవటం.. ఊహించటానికే వణుకు పుట్టేలా లేదు. అంత మంది పిల్లల్ని కన్నందుకు సంతోషించాలో.. వారి అలనాపాలనా చూసుకోవటానికి సినిమా కనిపించటం ఖాయం. అప్పుడెప్పుడో ఖుషి సినిమాలో లాస్ట్ సీన్ లో మాదిరి.. అంతమంది పిల్లల్ని మేనేజ్ చేయటానికి ఈ భార్యభర్తలకు రోజు సరిపోదేమో?
This post was last modified on June 9, 2021 11:24 am
తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…
హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…