ఆంటీగ్వా నుండి మొహుల్ చోక్సీని కిడ్నాప్ చేసి డొమినికాకు ఎత్తుకెళ్ళారనే ప్రచారమంతా ఉత్త డ్రామా అనే విషయం బయపడుతోంది. కిడ్నాప్ జరిగిందని చెబుతున్న సమయానికి, డొమినికాలో చోక్సీ ప్రత్యక్షమైన సమయానికి మధ్యలో చాలా తేడాలున్నట్లు ఇటు ఆంటీగ్వా అటు డొమినికా పోలీసులు గ్రహించారు. ఆంటీగ్వా-డొమినికా మధ్య సముద్రమార్గంలో 120 మైళ్ళ దూరం ఉంది. ఈ సమయాన్ని ఎంత వేగంగా ప్రయాణించినా కవర్ చేయటానికి కనీసం 12 గంటలు పడుతుందట.
దీని ప్రకారం ఆంటీగ్వాలో బయలుదేరి డొమినికాకు చేరే సమయానికి సంబంధించి చోక్సీ చేస్తున్న వాదనకు, చోక్సీ డొమినికాలో పట్టుబడిన సమయానికి, అదే సమయంలో ఆంటీగ్వాలో చోక్సీ కుటుంబసభ్యులు చెప్పిన సమాచారానికి చాలా తేడాలున్నాయి. దీన్ని బట్టి ఆంటీగ్వాలో ఉంటే భారత్ కు తనను పట్టి ఇవ్వటం ఖాయమని అర్ధం చేసుకున్న తర్వాతే చోక్సీ డొమినికాకు పారిపోయినట్లు నిర్ధారణవుతోంది. మామూలుగా అయితే ఆంటీగ్వా నుండి డొమినికాకు వెళ్ళాలంటే పోలీసులు అంగీకరించరు.
ఎందుకంటే అప్పటికే చోక్సీపై రెడ్ కార్నర్ నోటీసు జారీ అయ్యుంది. అందుకనే దొంగమార్గం ద్వారా డొమినికాకు పారిపోయి అక్కడ నుండి క్యూబాకు వెళ్ళిపోవటానికి చోక్సీ పెద్ద ప్లానే వేసుకున్నాడు. క్యూబాలో కూడా చోక్సీ పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టాడట. అంటే ఇపుడు బయటపడుతున్న విషయాలను గమనిస్తుంటే భారత్ నుండి పారిపోవటానికి చాలా కాలం ముందు నుండే చోక్సీ మాస్టర్ ప్లాన్ వేసుకున్న విషయం అర్ధమైపోతోంది.
ఇక కస్టడీలో ఉండగా డొమినికా పోలీసులు తనను కొట్టారని చోక్సీ చేసిన ఆరోపణలు కూడా వీగిపోయాయి. తన చేతిమీద, కంటిపైన పోలీసులు కొట్టారని చోక్సీ చెప్పిందంతా అబద్ధమని తేలిపోయింది. చేతిమీదున్న గాయాలు పాతవే అని డొమినికాలో వైద్యులు తేల్చేశారు. ఇక కంటిమీద గాయం నిర్లక్ష్యంగా ఉంటే ఎవరికైనా అయ్యేదేననని వైద్యులు తేల్చేశారు. మొత్తంమీద ఆంటీగ్వా టు క్యూబా వయా డొమినికాకు పారిపోవటానికి చోక్సీ వేసుకున్న ప్లాన్ చివరి నిముషంలో ఫ్లాప్ అయ్యింది.
This post was last modified on June 8, 2021 4:13 pm
వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…
ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…