Trends

సింగిల్ మామిడిపండు ధర రూ.వెయ్యి.. స్పెషాలిటీ ఏంటంటే..!

వేసవికాలం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. ఆ పండు కీ.. ఈ సీజన్ కి విడదీయరాని అనుబంధం ఉంది. ఈ కాలంలో ఎక్కడ చూసినా బుట్టలు బుట్టలుగా మామిడి పండ్లు కనపడుతూనే ఉంటాయి. కొందరు పచ్చి కాయలతో పచ్చడి పెట్టుకుంటే.. కొందరు.. తీయని పండ్లను ఆస్వాదిస్తారు. రేటు మాట ఎలా ఉన్నా.. ఎండాకాలంలో మామిడి పండు తినని వారు చాలా అరుదనే చెప్పాలి.

అయితే.. ఇప్పుడు మనం చెప్పుకునే మామిడి పండు మాత్రం పూర్తిగా భిన్నం. అన్ని మామిడి పండ్లు ఎండాకాలంలో కాస్తే.. ఈపండు మాత్రం వర్షాకాలంలో కాస్తుంది. అందుకే కాబోలు దీని డిమాండ్ మామూలుగా ఉండదు. ఈ పండు కేవలం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే పడుతుంది. మరి దీని స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందామా..

మధ్యప్రదేశ్‌కు చెందిన ‘నూర్జాహాన్‌’ రకం మామిడి పండుల్లో అన్నిటికన్నా చాలా స్పెషల్. ఈ మామిడి పండు బరువు కిలోల్లో ఉంటుంది. ఇప్పుడు దీని ధర వెయ్యి రూపాయలు పలుకుతోంది. దీని ప్రత్యేకత ఏంటంటే దీని పంట జూన్ నెల నుంచి ప్రారంభమవుతుంది. అంటే మన దేశవాళీ రకాల పంట పూర్తిగా అయిపోయిన తరువాత ‘నూర్జహాన్’ పంట మార్కెట్లోకి వస్తుంది. దీనికి పూత జనవరి, ఫిబ్రవరి నెలలో వస్తుంది.

‘నూర్జహాన్’ మామిడి పండ్లు ఆఫ్ఘన్ ప్రాంతానికి చెందిన మామిడి రకం. గుజరాత్ సరిహద్దుకు ఆనుకొని ఉన్న అలీరాజ్‌పూర్ జిల్లాలోని కత్తివాడ ప్రాంతంలో మాత్రమే ఈ మామిడి పెంపకం సాగు చేస్తారు. ఇలా.. మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలో పండే ‘నూర్జహాన్’ మామిడి పళ్లకు ఈసారి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అయితే గతేడాదితో పోలిస్తే పండు పరిమాణం ఈసారి పెద్దగా ఉండడంతో.. నూర్జహాన్’ మామిడి ఒక్కోటి ఈ సీజన్‌లో రూ. 500 నుంచి రూ. 1000 పలుకుతోందని వాటిని పండించిన రైతులు చెపుతున్నారు.

“నా తోటలో మూడు నూర్జహాన్ మామిడి చెట్లకు 250 మామిడి పండ్లు పండాయి. ఒక్కో పండుకు రూ. 500 నుంచి రూ. 1,000 ధర పలుకుతోంది. ఈ మామిడి పండ్ల కోసం ముందుగానే బుకింగ్‌లు చేసుకుంటారు. ఈసారి నూర్జహాన్ మామిడి బరువు 2 కిలోల నుంచి 3.5 కిలోల మధ్య వుంది. 2019లో ఒక్కో పండు 2.75 కేజల బరువుతో పండింది. అప్పట్లో అత్యధికంగా ఒక్కో పండు ధర రూ. 1,200 పలికింది.” అని కత్తివాడకు చెందిన మామిడి సాగు రైతు శివరాజ్ సింగ్ జాదవ్ తెలిపారు .. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా బుకింగ్ చేసుకొని దాని రుచి ఏంటో ఒకసారి చూడండి.

This post was last modified on June 7, 2021 3:56 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

2024 ఖేల్ రత్న విజేతలు.. కంప్లీట్ లిస్ట్ ఇదే!

ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…

2 hours ago

అభిమానుల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ అద్భుత సందేశం… పాటిస్తారా?

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న అభిమానుల‌కు అద్భుత సందేశం ఇచ్చారు. త‌న‌ను అభిమానిం చేవారు... త‌ప్ప‌కుండా పాటించాల‌ని…

2 hours ago

మహేష్-రాజమౌళి సినిమా రిలీజ్.. చరణ్ అంచనా

ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…

2 hours ago

హింసను ఇష్టపడుతున్న 5జి ప్రేక్షకులు

ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…

5 hours ago

మహేష్ – రాజమౌళి : ఇది కూడా రహస్యమేనా జక్కన్నా…

ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…

6 hours ago