అదేంటి? అని నోరెళ్లబెడుతున్నారా? మీరు చదివింది నిజమే! కరోనా కోరల్లో చిక్కుకున్న ప్రపంచం ఇప్పుడు మాస్కు జపం చేస్తున్న విషయం తెలిసిందే. మాస్కు పెట్టుకోకపోతే… దాదాపు అన్ని దేశాల్లో భారీ ఎత్తున జరిమానా విధిస్తున్నారు. ఇక్కడ మన దేశంలోనూ మాస్కు పెట్టుకోకపోతే.. జరిమానా కట్టాల్సిన పరిస్థితి ఉన్న విషయం తెలిసిందే. అయితే, అనూహ్యంగా ఒక దేశంలో మాత్రం మాస్కు పెట్టుకుంటే జరిమానా వేస్తున్నారు. ఇదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆ విశేషం.. ఇదీ..
అమెరికాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం.. వ్యాక్సినేషన్ వేగవంతం కావడంతో ఇకపై మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదని ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియాలోని ఫిడిల్‌హెడ్ కేఫ్ రెస్టారెంట్ అధినేత క్రిస్ తన కష్టమర్లకు విస్తుపోయే నిబంధన అమలు చేస్తున్నారు. రెస్టారెంట్లోకి మాస్క్ ధరించి వస్తే బిల్లుపై 5 డాలర్లు(350 రూపాయలు) అదనంగా చెల్లించాల్సి ఉంటుందని నిబంధన విధించారు.
అమెరికాలో మాస్క్ ధరించాల్సిన అవసరం లేకున్నా చాలా మంది కరోనా వ్యాప్తికి భయపడి మాస్క్‌లు ధరించే రోజువారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది రెస్టారెంట్‌లో అదనంగా 5 డాలర్లు చెల్లించడానికైనా సిద్ధపడుతున్నారు గానీ మాస్క్ తీసేయడానికి ససేమిరా అంటున్నారు. దీంతో రెస్టారెంట్‌లో బిల్లుపై అదనంగా 5 డాలర్లు చొప్పున బాగానే వసూలవుతున్నాయి.
ఇక, ఇలా వసూలైన నగదును స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వనున్నట్లు ఆ రెస్టారెంట్ యజమాని క్రిస్ కాస్టిల్‌మ్యాన్ వెల్లడించారు. స్వచ్ఛంద సంస్థకు చేయూత ఇవ్వడం కోసం కస్టమర్ల నుంచి 5 డాలర్లు ఈ విధంగా వసూలు చేయడం తన దృష్టిలో తప్పు కాదని క్రిస్ చెప్పుకొచ్చాడు. ఇక, ఈ విషయంపై అధికారులు కూడా మౌనం పాటించారు. ప్రభుత్వమే వద్దన్నాక ధరించడం ఎందుకని వారు కూడా ప్రశ్నిస్తున్నారు. అయినా.. ప్రజల్లో మాత్రం కరోనా భయం పోకపోవడం గమనార్హం. ఇదీ.. సంగతి!
This post was last modified on June 7, 2021 3:53 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…