Trends

హైద‌రాబాద్ క్రికెట‌ర్‌ను ఆదుకున్న కోహ్లి


స్ర‌వంతి నాయుడు అని హైద‌రాబాద్ మ‌హిళా క్రికెట‌ర్. ప్ర‌స్తుతం ఆమె వ‌య‌సు 34 ఏళ్లు. క్రికెట్ నుంచి కొన్నేళ్ల కింద‌టే రిటైరైంది. భార‌త జ‌ట్టు త‌ర‌ఫున ఆమె ఒక టెస్టు మ్యాచ్‌, నాలుగు వ‌న్డేలు, ఆరు టీ20లు ఆడింది. హైద‌రాబాద్ క్రికెట్ వ‌ర్గాల్లో స్ర‌వంతి పేరు బాగానే పాపుల‌ర్. ఇప్పుడు ఆమెకు పెద్ద క‌ష్టం వ‌చ్చింది. స్ర‌వంతి త‌ల్లిదండ్రులు ఇద్ద‌రూ క‌రోనా బారిన ప‌డ్డారు. త‌ల్లి ప‌రిస్థితి విష‌మంగా త‌యారైంది. వెంటిలేట‌ర్ మీద చికిత్స అందిస్తున్నారు. స్ర‌వంతి తండ్రి కూడా ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. వీరి చికిత్స కోసం స్ర‌వంతి ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బుల‌న్నీ ఖ‌ర్చు చేసింది. ఇప్ప‌టికే రూ.16 ల‌క్ష‌ల మేర ఖ‌ర్చయింది. అయినా త‌ల్లిదండ్రుల ప‌రిస్థితి మెరుగ‌ప‌డ‌లేదు. చికిత్స‌కు ఇంకా చాలా ఖ‌ర్చ‌వుతుంద‌ని తేలింది.

దిక్కు తోచ‌ని స్థితిలో ఉన్న స్ర‌వంతి గురించి ఓ మాజీ క్రికెట‌ర్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ప్ర‌స్తుతం క‌రోనా బాధితులకు సోష‌ల్ మీడియా ద్వారా గొప్ప తోడ్పాటు అందిస్తున్న క్రికెట‌ర్‌ హ‌నుమ విహారి, బ్యాడ్మింట‌న్ తార గుత్తా జ్వాల లాంటి వాళ్లు స్ర‌వంతి గురించి పోస్టులు పెట్టారు. దీంతో విష‌యం బీసీసీఐ వ‌ర‌కు వెళ్లింది. టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి కూడా విష‌యం తెలిసింది. ఇప్ప‌టికే కోవిడ్‌పై పోరాటానికి భార్య‌తో అనుష్క శ‌ర్మ‌తో క‌లిసి రూ.2 కోట్లు ఇవ్వ‌డంతో పాటు మొత్తం రూ.11 కోట్ల విరాళాలు సేక‌రించిన కోహ్లి.. స్ర‌వంతిని ఆదుకోవ‌డానికి ముందుకు వ‌చ్చాడు. రూ.6.77 ల‌క్ష‌ల సాయం ఆమెకు అంద‌జేశాడు.

మ‌రోవైపు బీసీసీఐ సూచ‌న మేర‌కు హైద‌రాబాద్ క్రికెట్ సంఘం స్ర‌వంతికి రూ.5 ల‌క్ష‌లు కేటాయించింది. అందులో మూడు ల‌క్ష‌లు ఇప్ప‌టికే ఆమె చేతికి అందాయి. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న త‌న‌కు ఇలా వివిధ మార్గాల నుంచి సాయం అందుతుండ‌టంతో ఇక డ‌బ్బుల గురించి టెన్ష‌న్ ప‌డ‌టం మాని త‌ల్లిదండ్రులు కోలుకోవ‌డం గురించి దృష్టిసారించే అవ‌కాశం ల‌భించింది స్ర‌వంతికి.

This post was last modified on May 20, 2021 8:34 am

Share
Show comments

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

7 hours ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

9 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

10 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

10 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

11 hours ago