దేశాన్ని పట్టిపీడిస్తున్న టీకాల కొరతను అధిగమించేందుకు భారత్ బయోటెక్ ఫార్మా కంపెనీ తన ఉత్పత్తి కోవ్యాగ్జిన్ ఫార్ములాను షేర్ చేసుకుంటున్నట్లు సమాచారం. అందరికీ టీకాను వీలైనంత వేగంగా ఇవ్వాలంటే కోవ్యాగ్జిన్, కోవీషీల్డ్ టీకాల ఫార్ములను ఇతర ఫార్మా కంపెనీలతో పంచుకోవటం ఒకటే మార్గమని దేశంలో అన్నీవర్గాల నుండి డిమాండ్లు పెరిగిపోతున్నాయి.
కోవీషీల్డ్ టీకా ఫార్ములను ఇతర కంపెనీలతో షేర్ చేసుకోవటానికి సీరమ్ కంపెనీ అంగీకరించే అవకాశంలేదు. ఎందకంటే ఇదిపూర్తిగా ప్రైవేటు సంస్ధ కాబట్టే. ఇదే సమయంలో కోవాగ్జిన్ టీకా ఫార్ములను యాజమాన్యం భారత్ బయోటెక్ ఇతర కంపెనీలతో పంచుకునే అవకాశంఉంది. ఎందుకంటే ఇందులో భారత ప్రభుత్వం వాటాకూడా ఉంది. కోవ్యాగ్జిన్ టీకా ఉత్పత్తిలో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ అండ్ రీసెర్చి (ఐసీఎంఆర్) పాత్రకూడా ఉంది.
అందుకనే ఈ విషయమై భారత్ బయెటెక్ యాజమాన్యంతో మాట్లాడి కేంద్రప్రభుత్వం ఫార్ముల షేరింగ్ కు ఒప్పించింది. దీంతో హైదరాబాద్ లోనే ఉన్న మరో రెండు ఫార్మా కంపెనీలు ఇండియన్ బయోలాజికల్, భారత్ బయోలాజికల్ కంపెనీలో కూడా కోవ్యాగ్జిన్ టీకాలు తయారు కానున్నాయి. ఇవేకాకుండా ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలో కూడా కోవ్యాగ్జిన్ టీకాను ఉత్పత్తి చేసే విషయాన్ని కేంద్రం+భారత్ బయోటెక్ యాజమాన్యాలు మాట్లాడుతున్నాయట.
ఉత్పత్తి సామర్ధ్యం పెంచుకోలేనపుడు, టీకాల డిమాండ్ ను తట్టుకోలేనపుడు కోవ్యాగ్జిన్ ఫార్ములను ఇతర కంపెనీలతో పంచుకుని ఉత్పత్తి చేయించాలన్న జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోడికి సూచన చేసిన విషయం తెలిసిందే. కారణం ఏదైనా టీకాల ఉత్పత్తి పెంచటానికి కేంద్రం తీసుకున్న చొరవ అభినందనీయమనే చెప్పాలి. అన్నీ అనుకున్నట్లు జరిగితే దేశీయంగా అభివృద్ధి చేసిన టీకాల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది.
This post was last modified on May 14, 2021 10:55 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…