కుక్కలు.. పిల్లులు.. బొద్దింకలు.. గబ్బిలాలు.. పాములు.. కప్పలు.. ఇవీ అవీ అని తేడా లేవు. ఏ జంతువైనా.. ఏ కీటకమైనా.. ఏ జీవి అయినా చైనీయులకు తేడా ఉండదు. చూడగానే నోరూరిపోతుంది. ప్రపంచంలో వీళ్లలా ఇన్ని జీవుల్ని తినే మనుషులు ఇంకెక్కడైనా ఉంటారా అంటే సందేహమే.
వాళ్ల మాంసం పిచ్చే కరోనా వైరస్‌కు కారణమైందని.. వుహాన్‌లోని ప్రపంచ అతి పెద్ద మాంసం మార్కెట్టే వైరస్ వ్యాప్తికి కేంద్రమైందని ఆరోపణలున్న సంగతి తెలిసిందే. ఐతే కరోనా వ్యాప్తి పెరిగాక అక్కడ మార్కెట్‌ను మూసేశారు.
వుహాన్ సహా కొన్ని నగరాల్లో మాంసం విక్రయాల్ని ఆపేశారు. కానీ అక్కడ లాక్ డౌన్ ఎత్తేశాక మళ్లీ మాంసం విక్రయాలు పునఃప్రారంభం అయ్యాయి. ఎప్పట్లాగే జనాలు అన్ని రకాల మాంసాన్ని తినేస్తున్నారు.
చైనాలోని ఓ చోట ఒక బండిలో బతికున్న కప్పలు వందల సంఖ్యలో పోసి పెడితే.. జనాలు చుట్టూ చేరి కప్పల్ని ఏరి కవర్లలో వేసుకుంటున్న ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కప్పల్ని తినడమేంటి అని మనకు అసహ్యం పుట్టొచ్చు కానీ.. చైనీయులు మాత్రం బతికున్న కప్పల్ని అలాగే నూనెలోకి వేసి బయటికి తీసి లాగించేస్తారు. మనం లైవ్ ఫిష్ కోసం ఎలా ఆసక్తి చూపిస్తామో వాళ్లు లైవ్ కప్పలు అలా అన్నమాట.
ఐతే మనం చేపనైనా, కోడినైనా చర్మం తీసి బాగా ఉడికించి మసాలా దట్టించి కూర చేసుకుని తింటాం. కానీ చైనీయులు అలా కాదు.. ఏ జీవినైనా జస్ట్ అలా వేడి నీళ్లలో వేసి బయటికి తీసి నోట్లో వేసుకుంటారు. ఏడాది వయసున్న పిల్లాడు బతికున్న కప్పను తినే ప్రయత్నం చేస్తుంటే.. తల్లిదండ్రులు నవ్వుతూ ఆడిస్తున్న వీడియో కూడా ఒకటి యూట్యూబ్‌లో కనిపిస్తోంది.
మనం బొద్దింకను చూస్తేనే బెంబేలెత్తిపోతాం. అసహ్యించుకుంటాం. ముట్టుకోవడానికీ ఇష్టపడం. ఐతే చైనాలో ఫామ్ ఏర్పాటు చేసి బొద్దింకల్ని పెంచుతారు. నేరుగా నూనెలో వేయించి తినేస్తారు.
This post was last modified on May 13, 2020 11:31 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…