ఈమధ్యకాలంలో ఎలాంటి ఘోరాలు జరుగుతున్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఒక్క రోజులో కొన్ని వందల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయ్. ప్రయాణించే సమయంలో జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పిన సరే కొందరి నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయ్. ఇక ఈ నేపథ్యంలోనే ఈరోజు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో లారీ కంటైనర్ లో మంటలు తారాస్థాయిలో చెలరేగడంతో క్యాబిన్ లో ఉన్న డ్రైవర్, క్లీనర్ లు సజీవ దహనం అయ్యారు. ఈ లారీ ఆంధ్రప్రదేశ్ నర్సాపూర్ నుండి రోయ్యల లోడుతో వచ్చింది. అయితే ఈ భారీ కంటైనర్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హిమాయత్ సాగర్ వద్దకు చేరేసమయంలో ప్రమాదానికి చోటుచేసుకుంది.
దింతో ఆ లారీ కంటైనర్ లో మంటలు చెలరేగడంతో సూరజ్, మూర్తునుజన్ అనే డ్రైవర్, క్లీనర్ లు సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాద విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఫైర్ ఇంజన్‌లతో ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మంటలు అదుపు చేసే లోపే ఇద్దరు సజీవదహనం అయ్యారు.
This post was last modified on April 15, 2021 9:44 am
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…