విరాట్ కోహ్లి.. ఈ తరంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా దిగ్గజాలతో కితాబులందుకున్న ఆటగాడు. టెస్టుల్లో అతడికి స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్ గట్టి పోటీ ఇచ్చినా.. కొన్ని సమయాల్లో అతణ్ని మించి ఆ ముగ్గురూ ఫామ్ చాటుకున్నా.. అన్ని ఫార్మాట్లలో నిలకడగా రాణించే ఆటగాడిగా.. ఎంతకీ పరుగుల దాహం తీరని అరుదైన బ్యాట్స్‌మన్‌గా.. వేరెవరికీ సాధ్యం కాని రికార్డులు బద్దలు కొట్టే ఆటగాడిగా అతడికున్న పేరు, గుర్తింపే వేరు. భారత క్రికెట్లో సచిన్‌ను మించిన బ్యాట్స్‌మన్ రాడని అంతా అనుకున్నారు కానీ.. మాస్టర్ సాధించిన ఎన్నో రికార్డులను అలవోకగా దాటేసి ఔరా అనిపించాడు కోహ్లి.
గొప్ప ఆటగాళ్లలో చాలామందికి ఒక ప్రైమ్ టైమ్ నడుస్తుంది. అది రెండు మూడు లేదా నాలుగేళ్లు నడుస్తుంది. కానీ కోహ్లి దశాబ్దం పాటు తన ప్రైమ్ టైమ్‌ను కొనసాగిస్తూ వచ్చాడు. ఇదే అతడి అత్యుత్తమ స్థాయి అనుకున్నపుడల్లా ఆ అంచనాల్ని మించి పరుగుల వరద పారిస్తూ ఆశ్చర్యపరిచాడు. 2018-19 సీజన్లో అతడి ఫామ్ చూసి అతడి దాహానికి అంతెక్కడ అని ఆశ్చర్యపోయారు విశ్లేషకులు.
సమీప భవిష్యత్తులో అతను జోరు తగ్గించేలా కనిపించలేదు. కానీ 2020 కోహ్లి కథను మార్చేసింది. కెరీర్ ఆరంభంలో ఒక్క ఏడాది తప్ప అతను సెంచరీ చేయకుండా ఏడాదిని ముగించిందే లేదు. ఇంకెప్పుడూ అలాంటి ఏడాది ఇంకొకటి వస్తుందని ఎవరూ అనుకోలేదు. కానీ నిరుడు అతను ఏ ఫార్మాట్లోనూ రెండంకెల స్కోరు చేయలేదు. కరోనా కారణంగా జరిగిన మ్యాచ్‌లు తక్కువే కానీ.. అయినా కూడా కోహ్లి ఏ ఫార్మాట్లోనూ సెంచరీ చేయకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే కొత్త ఏడాదిలో విరాట్ ఆట మారుతుందని, అతను మళ్లీ విశ్వరూపం చూపిస్తాడని అభిమానులు ఆశించారు. కానీ ఈ ఏడాది కూడా విరాట్ తన స్థాయికి ఏమాత్రం తగని ప్రదర్శన చేస్తున్నాడు.
చెన్నైలో తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన విరాట్.. రెండో ఇన్నింగ్స్‌లో 70 ప్లస్ స్కోరుతో ఫామ్ అందుకున్నట్లు కనిపించాడు. కానీ ఆ ఇన్నింగ్స్ జట్టుకు ఉపయోగపడలేదు. ఆ మ్యాచ్‌లో భారత్ చిత్తుగా ఓడింది. రెండో టెస్టులో దెబ్బకు దెబ్బ తీయకుంటే పరువు పోయే స్థితిలో విరాట్ కసిగా ఆడతాడనుకుంటే ఖాతా కూడా తెరవకుండానే ఔటై వెనుదిరిగాడు. పార్ట్ టైం స్పిన్నర్ అయిన మొయిన్ అలీ అతణ్ని బౌల్డ్ చేసి షాకిచ్చాడు. అతను ఔటైన తీరు చూస్తే ఆత్మవిశ్వాస లోపం స్పష్టంగా కనిపించింది. ఇది చూసి కోహ్లి ప్రైమ్ టైమ్ అయిపోయిందా.. ఇక అతడి పతనం చూడబోతున్నామా అన్న సందేహాలు బలంగా కలుగుతున్నాయి.
This post was last modified on February 13, 2021 10:22 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…