పదేళ్ల క్రితం ఆయన గురించి తెలిసినోళ్లు తక్కువ మందే. కానీ.. ఐదేళ్ల నుంచి ఆయన పేరు తరచూ వినిపిస్తూ ఉండటమే కాదు.. వార్తలకు కేంద్రంగా మారారు. ఆయన వ్యక్తిగత అంశాలు సైతం సినిమాటిక్ గా ఉండటంతో బాగా పాపులర్ అయ్యారు. ఆయన ఎవరో కాదు.. అమెజాన్ వ్యవస్థాపకుడు.. ప్రపంచ కుబేరుల్లో ఒకరు జెఫ్ బెజోస్. ఇటీవల కాలం వరకు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఉన్నారు. టెస్లా కార్ల అధినేత ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ప్రకటించటంతో ఆయన ర్యాంక్ వెనక్కి వెళ్లింది. అలాంటి ఆయన తాజాగా షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నారు.
ఈ ఏడాది మూడో త్రైమాసికంలో అమెజాన్ సీఈవో పదవి నుంచి వైదొలుగుతున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. తన తర్వాత అమెజాన్ సీఈవోగా ఆండీ జాసీని నియమించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆండీ.. అమెజాన్ వెబ్ సర్వీసులకు అధిపతిగా వ్యవహరిస్తున్నారు. తాను తీసుకున్న నిర్ణయాన్ని జెఫ్ బెజోస్ అమెజాన్ ఉద్యోగులకు లేఖ రూపంలో తెలియజేశారు.
సీఈవో పదవి నుంచి వైదొలిగినప్పటికీ అమెజాన్ తీసుకునే అతి ముఖ్యమైన నిర్ణయాల్లో తాను కూడా పాలు పంచుకోనున్నట్లు ఆయన తెలిపారు. సీఈవో పదవి నుంచి వైదొలుగుతున్న జెఫ్ బెజోస్.. తర్వాతేం చేయబోతున్నారు? అన్న ప్రశ్న కంటే ముందే ఆయనే తన ఫ్యూచర్ ప్లాన్ గురించి వెల్లడించారు. సీఈవో పదవి నుంచి రిటైర్ అయిన తర్వాత సేవా కార్యక్రమాలపై ఫోకస్ పెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఆయన సేవా కార్యక్రమాలు ఏ రీతిలో ఉంటాయో చూడాలి.
This post was last modified on February 3, 2021 10:38 am
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…