Trends

దీన్ని పట్టుకుని ధోని ఫాన్స్ ఏదో ఊహించుకున్నారు

సంగీత దర్శకుడిగా ఫుల్ బిజీగా ఉంటున్నప్పటికీ.. నటుడిగా గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తుంటాడు జి.వి.ప్రకాష్ కుమార్. ప్రతి సంవత్సరం హీరోగా ఒకటికి మించి సినిమాలు రిలీజ్ చేస్తూ వస్తున్నాడతను. ఈ ఏడాది హ్యాపీ రాజ్, ఇమ్మోర్టల్ అనే సినిమాలతో అతను ప్రేక్షకులను పలకరించాడు. ఇంకో రెండు సినిమాలు చేతిలో ఉండగానే.. తాజాగా మరో సినిమాను అనౌన్స్ చేశాడు. అదే.. అన్బుదాన్ మహి.

ఓటీటీలో వివిధ భాషల ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘జో’ సినిమాను డైరెక్ట్ చేసిన హరిహరన్ రామ్ నుంచి రాబోతున్న కొత్త చిత్రమిది. ‘జో’ హీరోయిన్ మాళవిక మనోజ్ ఇందులో జి.వి.ప్రకాష్‌కు జోడీగా నటిస్తోంది. ఈ చిత్రానికి ‘అన్బుదాన్ మహి’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఐతే ఈ సినిమా టైటిల్ చూశాక జనం ఉస్సూరుమంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు.

జి.వి.ప్రకాష్ కుమార్ కొత్త సినిమా గురించి ముందు రోజు ‘మహి రిటర్న్స్’ అంటూ ఒక హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది. దీంతో మహేంద్రసింగ్ ధోని‌కి ఈ సినిమాతో సంబంధం ఉందని.. అతను అందించిన కథతో ఈ సినిమా తెరకెక్కబోతోందని ఒక ప్రచారం నడిచింది. కానీ చివరికి చూస్తే జి.వి. ఇందులో మహి అనే పాత్ర మాత్రమే చేస్తున్నాడని, దీనికి ధోనికి ఏ సంబంధం లేదని వెల్లడైంది.

ఐపీఎల్ ఆరంభం నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతూ ఉండడం వల్ల తమిళ అభిమానులతో ధోనికి గొప్ప అనుబంధం ఏర్పడింది. ఆ బంధాన్ని క్రికెట్‌కు మాత్రమే పరిమితం చేయకుండా.. తమిళంలో ‘ఎల్‌జీఎం’ అనే సినిమాను నిర్మించాడు. ఈ నేపథ్యంలో ధోని మళ్లీ ఒక తమిళ సినిమాలో భాగం అవుతున్నాడని, అతను రాసిన కథతో సినిమా వస్తోందని అంటే నెటిజన్లు నమ్మేశారు. కానీ అందులో ఏ నిజం లేదని.. కేవలం మహి అనే పేరును, ఆ పేరును రాయడంలో ధోని సిగ్నేచర్‌ స్టైల్‌ను ఈ చిత్ర బృందం వాడుకుంటోందని.. అంతకుమించి ఏమీ లేదని క్లారిటీ వచ్చింది.

This post was last modified on November 17, 2026 2:54 pm

Share

Recent Posts

కర్నూలులో ప్రధాని మోదీ తల్లికి ఆలయం

ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశాధినేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒకరు. దశాబ్దకాలంగా మోదీ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించారు. భారతదేశానికి…

2 hours ago

కోనసీమలో మళ్లీ గ్యాస్ లీక్… చెక్ ఎప్పుడు?

అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలో ఓఎన్జీసీ గ్యాస్ లీకైన ఘటన కలకలం రేపింది. తాడివారి మెరక వద్ద ఓఎన్‌జీసీ…

3 hours ago

టాటా గ్రూప్‌లో మళ్ళీ టేకోవర్ టెన్షన్

భారత పారిశ్రామిక రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న టాటా గ్రూప్‌లో ఇప్పుడు పాలనా వ్యవహారాలు చర్చనీయాంశంగా మారాయి. సంస్థను ఎవరు…

4 hours ago

విశ్వ రహస్యంగా మారుతున్న రిలీజ్ వ్యవహారం

విశ్వంభర థియేటర్ హక్కులు మైత్రి సంస్థ కొన్నదని నిన్నంతా ప్రచారం జరిగింది. రెండు రోజుల క్రితం ఆర్టిస్టు ప్రవీణ్ తాను…

5 hours ago

అర్జునుడు వాడుతున్న ‘మెగా’ బ్రహ్మాస్త్రం

ఇటీవలే విడుదలైన ఇట్లు అర్జున కి పర్లేదనే టాక్ వచ్చింది. టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు భారీ ఎత్తున మద్దతిచ్చారు. జూనియర్…

5 hours ago

అప్పుడు బాల‌య్య‌తో… ఇప్పుడు చిరుతో?

మిగ‌తా అగ్ర క‌థానాయ‌కుల‌తో పోలిస్తే ప్ర‌భాస్ కొంచెం వేగంగానే సినిమాలు చేస్తుంటాడు కానీ.. బ‌య‌ట అభిమానుల‌కు క‌నిపించ‌డం త‌క్కువ‌. సినిమా…

5 hours ago