ఇండియాలో హాలీవుడ్ సూపర్ హీరోల సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రాంతీయ భాషల్లో డబ్బింగ్ చేయడం మొదలుపెట్టాక వీటికి మరింత ఆదరణ దక్కుతోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 17 విడుదల కాబోతున్న అవెంజర్స్: డూమ్స్‌డే మీద ప్రేక్షకుల్లో ఓ రేంజ్ హైప్ నెలకొంది. నెల రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెడితే అప్పుడే కొన్ని షోలు హౌస్ ఫుల్ అయ్యాయి. ముంబైలో అర్ధరాత్రితో మొదలుపెట్టి ఒక్కో స్క్రీన్‌లో ఏకంగా ఎనిమిది ఆటలు ప్రదర్శించబోతున్నారు.
నార్త్ లోనే కాదు మన దగ్గర కూడా తెనాలి లాంటి బి సెంటర్లో టికెట్ల అమ్మకాలు మొదలయ్యాయంటే డిస్ట్రిబ్యూటర్లు ఎంత ప్రణాళికతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఆంథోనీ రుస్సో & జో రుస్సో బ్రదర్స్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ విజువల్ గ్రాండియర్ లో చాలా విశేషాలున్నాయి. థండర్ బొల్ట్స్ కథ జరిగిన 14 నెలల తర్వాత ఈ స్టోరీ మొదలవుతుంది. మూడు యునివర్స్ లకు చెందిన ఫెంటాస్టిక్ ఫోర్, వకండా యోధులు, ఎక్స్ మెన్, అవెంజర్స్ అందరూ ఒకేచోట కలుస్తారు.
డాక్టర్ డూమ్ చేయబోయే విధ్వంసాన్ని అడ్డుకోవడానికి వీళ్ళు ఏం చేశారనే దాని మీద అవెంజర్ డూమ్స్ డే నడుస్తుంది. మార్వెల్ లో ఇప్పటిదాకా వచ్చిన సూపర్ హీరోలందరూ కలవబోయే మల్టీస్టారర్ గా డూమ్స్ డే ప్రత్యేకత సంతరించుకోనుంది. ఇప్పటికే వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 150 మిలియన్ డాలర్లు వసూలు చేసిన ఈ సూపర్ హీరో థ్రిల్లర్ రిలీజ్ నాటికి ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో ఊహకు అందడం లేదు. పోటీలో ఉన్న డ్యూన్ 3 పూర్తిగా వెనుకబడిపోవడం అసలు ట్విస్ట్.
ఇక్కడీ విషయాన్ని మనం ప్రత్యేకంగా చెప్పుకోవడం వెనుక కారణముంది. వందల వేల కోట్లు పెట్టి ప్యాన్ ఇండియా సినిమాలు తీసే మన దర్శక నిర్మాతలు రిలీజ్ టైంలో అడ్వాన్స్ బుకింగ్ కనీసం వారం రోజులు ముందు పెట్టలేకపోతున్నారు. సెన్సార్, చివరి దశ పనులు, బిజినెస్ వ్యవహారాలు అంటూ ఏవేవో కారణాలు చెప్పి కేవలం ఒక రోజు ముందు టికెట్లు అమ్మకానికి పెట్టిన దాఖలాలు ఎన్నో. అవెంజర్స్ లాంటివి మన దేశంలో కూడా ఇంత అడ్వాన్స్ గా బుకింగ్స్ పెట్టడం సీరియస్ గా ఆలోచించాల్సిన విషయమే.
This post was last modified on November 17, 2026 10:55 am
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశాధినేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒకరు. దశాబ్దకాలంగా మోదీ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించారు. భారతదేశానికి…
అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలో ఓఎన్జీసీ గ్యాస్ లీకైన ఘటన కలకలం రేపింది. తాడివారి మెరక వద్ద ఓఎన్జీసీ…
భారత పారిశ్రామిక రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న టాటా గ్రూప్‌లో ఇప్పుడు పాలనా వ్యవహారాలు చర్చనీయాంశంగా మారాయి. సంస్థను ఎవరు…
విశ్వంభర థియేటర్ హక్కులు మైత్రి సంస్థ కొన్నదని నిన్నంతా ప్రచారం జరిగింది. రెండు రోజుల క్రితం ఆర్టిస్టు ప్రవీణ్ తాను…
ఇటీవలే విడుదలైన ఇట్లు అర్జున కి పర్లేదనే టాక్ వచ్చింది. టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు భారీ ఎత్తున మద్దతిచ్చారు. జూనియర్…
మిగతా అగ్ర కథానాయకులతో పోలిస్తే ప్రభాస్ కొంచెం వేగంగానే సినిమాలు చేస్తుంటాడు కానీ.. బయట అభిమానులకు కనిపించడం తక్కువ. సినిమా…