కొత్త శుక్రవారం వచ్చింది. బోలెడు రిలీజులు తెచ్చింది. తమ సినిమాని జనం చూసేందుకు ఏమేం చేయాలో ప్రమోషన్ల పరంగా అన్ని టీములు అన్నీ చేశాయి. అయితే థియేటర్ల దగ్గర జనం తండోపతండాలుగా ఉన్నారా అంటే ఇంకా పికప్ అయ్యే అవసరాన్ని బుకింగ్ కౌంటర్లు సూచిస్తున్నాయి. కొత్త హీరో అనీష్ నటించిన ఇట్లు అర్జునకు టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు సోషల్ మీడియా మద్దతు టాక్ రూపంలో బాగానే దక్కింది. ఇది కలెక్షన్లు కన్వర్ట్ కావాలంటే ఇంకొంచెం టైం పట్టేలా ఉంది.
స్లోగా ఆక్యుపెన్సీలు పెరుగుతున్నాయి కనక దాన్ని మంచి శకునంగా భావించవచ్చు. అయితే వీకెండ్ వరకు కంట్రోల్ పెంచుకుంటుందా లేదానేది ఫైనల్ స్టేటస్ మీద ప్రభావం చూపిస్తుంది. విపరీతమైన హడావిడి చేసిన మౌళి డిఎన్ కెకు యూత్ సపోర్ట్ కొంత మేర పని చేసింది. టాక్ ఏంటనేది ఇంకొంచెం ఆగితే పూర్తి క్లారిటీ వస్తుంది కానీ కామెడీ, క్రైమ్ మిక్స్ చేసి మైత్రి లాంటి పెద్ద బ్యానర్ లో మౌళి పడటం తన అదృష్టంగా చెప్పొచ్చు. దీన్ని నిలబెట్టుకోవాలంటే సోమవారం దాకా స్ట్రాంగ్ గా ఉండాలి.
మాయలేడీ గురించి మెల్లగా మాట్లాడుకుంటున్నారు. దీని ఎఫెక్ట్ వీలైనంత వేగంగా పెరగాలి. డార్క్ చాకొలేట్ విషయంలో ప్రచారం పెద్దగా జరగకపోవడంతో బుకింగ్స్ అంతగా కనిపించడం లేదు. ఆశ్చర్యంగా గీతాంజలి రీ రిలీజ్ కు సిటీ సెంటర్స్ లో చాలా చోట్ల దాదాపు ఫుల్స్ పడ్డాయి. హైదరాబాద్, విజయవాడ లాంటి నగరాల్లో వింటేజ్ మూవీ లవర్స్ దీన్ని ఎంజాయ్ చేస్తున్న వైనం వీడియోల్లో చూడొచ్చు. కాకపోతే పోటీ కారణంగా ఎక్కువ షోలు దొరకకపోవడం బ్యాడ్ లక్.
ఫైనల్ గా చెప్పాలంటే అనుమానంగా మొదలైన నవంబర్ నెలకి రామాయణ, సీన్ జోష్ తీసుకొస్తే వాటిని కొనసాగించాల్సిన బాధ్యత పైన చెప్పిన సినిమాలకు ఉంది. ఏవి సక్సెస్ అవుతాయనేది మొదటి రోజే చెప్పలేం కాబట్టి కొంత వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం పరీక్షల సీజన్ కాదు. వర్షాలు కూడా తగ్గిపోయాయి. సో థియేటర్లకు జనం రావడానికి పెద్దగా అడ్డంకులు లేవు. ఇదంతా పక్కనపెడితే ప్రమోషన్లలోనూ కొత్త పోకడలు తీసుకురావాల్సిన అవసరాన్ని ఓపెనింగ్స్ తేటతెల్లం చేస్తున్నాయి.
This post was last modified on November 13, 2026 11:08 pm
అంతర్జాతీయ క్రికెట్లో గత ఏడాది ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే సిరీస్‌తో భారత లెజెండరీ క్రికెటర్ రోహిత్ శర్మ కెప్టెన్సీ…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుతూనే వున్నాయి. తొలుత మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. కూటమి పై చేయి సాధించింది.…
"ఏపీకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. ఆయనకు విజన్ ఉంది. ఇక ఈ రాష్ట్రానికి సుదీర్ఘ సముద్ర తీరం కూడా ఉంది.…
శ్రీనివాస మంగాపురంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ రాషా తడాని. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తెగా సినీ ప్రేక్షకులకు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 ఏదో అనుకుంటే ఏదో చేసింది. నిజమే. కానీ మొదటి మూడు రోజులు హడావిడి చేసి…
కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ పేరు ఉపయోగించుకుని భారీ మోసానికి పాల్పడ్డారు కొందరు వ్యక్తులు. ప్రభుత్వ…