అంతర్జాతీయ క్రికెట్లో గత ఏడాది ఫిబ్రవరిలో ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే సిరీస్‌తో భారత లెజెండరీ క్రికెటర్ రోహిత్ శర్మ కెప్టెన్సీ ప్రయాణం ముగిసిపోయింది. అంతర్జాతీయ క్రికెట్లో ఒక్క వన్డే ఫార్మాట్లో మాత్రమే రోహిత్ కొనసాగుతుండగా.. అందులో పగ్గాలు తీసి, శుభ్‌మన్ గిల్‌కు అప్పగించేశారు సెలక్టర్లు. ఐపీఎల్‌లోనేమో మూడేళ్ల కిందటే రోహిత్ ముంబయి ఇండియన్స్ కెప్టెన్సీ కోల్పోయాడు. తన స్థానంలో మూడేళ్ల పాటు హార్దిక్ పాండ్య ముంబయిని నడిపించాడు.
కానీ ఇప్పుడు అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. హార్దిక్ ముంబయిని వదిలేసి పంజాబ్‌కు వెళ్లిపోయాడు. దీంతో తర్వాతి సీజన్‌కు ముంబయి పగ్గాలు అందుకునేదెవరనే ప్రశ్న తలెత్తింది. ఆ ఫ్రాంఛైజీ యాజమాన్యం చూపు హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ మీద పడ్డట్లుగా వార్తలు వస్తున్నాయి. అలా అని పక్కాగా తెలుగు కుర్రాడికే పగ్గాలిస్తారనే గ్యారెంటీ లేదు. తాత్కాలికంగా ఒక సంవత్సరం రోహిత్ శర్మకు మళ్లీ సారథ్య బాధ్యతలు ఇస్తారనే ప్రచారం కూడా జరుగుతుండడం విశేషం.
హార్దిక్ కెప్టెన్సీలో మూడేళ్లు తీవ్రంగా తడబడింది ముంబయి. దీంతో అతణ్ని సాగనంపేశారు. అలాగే కోచింగ్ బృందం మొత్తాన్ని మార్చేశారు. ఇలాంటి టైంలో తిలక్‌కు నేరుగా కెప్టెన్సీ ఇస్తే అతను ప్రెజర్ ఫీలవుతాడనే చర్చ జరుగుతోంది. అందుకే వచ్చే సీజన్‌కు రోహిత్ శర్మను తాత్కాలిక కెప్టెన్‌గా పెట్టి తన సారథ్యంలో తిలక్ రాటుదేలేలా చేయాలని అంబాని ఫ్యామిలీ ఆలోచిస్తోందంట. రోహిత్ సరే అంటే.. ఈ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారట. కానీ మూడేళ్ల ముందు తన నుంచి తీసి హార్దిక్‌కు కెప్టెన్సీ ఇవ్వడంపై రోహిత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది.
ఇందుకు ఫీలై అతను ముంబయి ఇండియన్స్‌కు టాటా చెప్పేస్తాడని కూడా వార్తలు వచ్చాయి. కానీ తర్వాత సర్దుకుని ఆ జట్టుతోనే ఉండిపోయాడు. ఇప్పుడది మనసులో పెట్టుకుని రోహిత్ ఫ్రాంఛైజీ ప్రపోజల్‌కు నో చెబుతాడేమో అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రోహిత్ నో అంటే మాత్రం వచ్చే సీజన్‌కు తిలక్‌నే కెప్టెన్‌గా చూస్తామేమో. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా 2 వేల కోట్ల విలువకు పెరిగిన ముంబయి లాంటి ఫ్రాంఛైజీని తెలుగు కుర్రాడు నడిపించడం అంటే పెద్ద విశేషమే.
This post was last modified on November 13, 2026 10:54 pm
కొత్త శుక్రవారం వచ్చింది. బోలెడు రిలీజులు తెచ్చింది. తమ సినిమాని జనం చూసేందుకు ఏమేం చేయాలో ప్రమోషన్ల పరంగా అన్ని…
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుతూనే వున్నాయి. తొలుత మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. కూటమి పై చేయి సాధించింది.…
"ఏపీకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. ఆయనకు విజన్ ఉంది. ఇక ఈ రాష్ట్రానికి సుదీర్ఘ సముద్ర తీరం కూడా ఉంది.…
శ్రీనివాస మంగాపురంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ రాషా తడాని. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తెగా సినీ ప్రేక్షకులకు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 ఏదో అనుకుంటే ఏదో చేసింది. నిజమే. కానీ మొదటి మూడు రోజులు హడావిడి చేసి…
కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ పేరు ఉపయోగించుకుని భారీ మోసానికి పాల్పడ్డారు కొందరు వ్యక్తులు. ప్రభుత్వ…