స్థానిక ఎన్నికల హడావుడి మొదలైంది. తొలి విడత కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో కూడా కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయనున్నట్లు ప్రకటించడం తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపిన కూటమి నాయకులు చివరికి సీట్ల సర్దుబాటు కుదుర్చుకున్నారు. దీంతో కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీకి దిగుతాయో, ఎక్కడెక్కడ నుంచి ఎవరు పోటీ చేస్తారోనన్న ఆసక్తి మొదలైంది.
ప్రస్తుతం రాష్ట్రంలో 17 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 11 స్థానాల్లో టీడీపీ పోటీ చేయడానికి అంగీకారం కుదిరింది. జనసేన 4స్థానాల్లో, బీజేపీ రెండు చోట్ల పోటీ చేయనున్నట్లు కూటమి పార్టీల నాయకులు ఉమ్మడి ప్రకటన గురువారం సాయంత్రం చేశారు. దీంతో కూటమి లో నెలకొన్న ఉత్కంఠ తొలిగిపోయింది. ఇక సమరంలోకి దూకాడమే మిగిలింది. ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నారు అనే లెక్కల కంటే అన్నీ స్థానాలు గెలవడం ఒక్కటే లక్ష్యంగా సీట్ల సర్దుబాటు చేసుకున్నట్లు ప్రకటించారు.
సీట్ల సర్దుబాటులో భాగంగా టీడీపీ గ్రేటర్ విశాఖ, విజయనగరం, మచిలీపట్నం, మంగళగిరి, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కడప, కర్నూలు, తిరుపతి, చిత్తూరు స్థానాల్లో పోటీకి దిగుతోంది.
శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లలో జనసేన పోటీకి దిగుతుండగా బీజేపీ రాజమండ్రి, అనంతపురం స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులుగా ఎన్నికల్లో దిగనున్నారు.
ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే…ఈ ఎన్నికల్లో కూటమి పార్టీల మధ్య విభేదాలు వచ్చి విడివిడిగా పోటీ చేస్తే మధ్యలో ప్రయోజనం పొందాలని చూసిన వైసీపీ నిరుత్సాహానికి గురైందని చెప్పవచ్చు. కనీసం ఫ్రెండ్లీ కంటెస్ట్ పేరుతో టీడీపీ, జనసేన పోటీకి దిగినా లాభం పొందోచ్చని ఆశలు పెట్టుకున్న ఫ్యాన్ పార్టీకి కూటమి ఉమ్మడి ప్రకటన స్విచ్చాఫ్ చేసినట్లయిందని విశ్లేషకులు చెప్పుకుంటున్నారు.
This post was last modified on October 15, 2026 11:59 pm
జైలర్ 2 లో హృతిక్ రోషన్ క్యామియో ఉందనేది ఎప్పుడో కన్ఫర్మ్ అయిన పాత న్యూస్. ఎంత నిడివి ఉంటుందనే…
కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో అనుపమ పరమేశ్వరన్ కు క్రేజ్ ఉండేది. శతమానం భవతి, అఆ, ప్రేమమ్ లాంటి హిట్లు…
పెద్ది కష్టానికి తగ్గ ఫలితం రాలేదని రామ్ చరణ్ అభిమానులు ఫీలవ్వడం అబద్దం కాదు. తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు వచ్చినా…
దసరా సెలవులు బాక్సాఫీస్ కు మంచి రెవిన్యూ తెచ్చే సీజన్. సరిగ్గా వాడుకుంటే పది రోజుల పాటు థియేటర్లకు కలెక్షన్లు…
కన్నడ అమ్మాయి కృతి శెట్టికి కెరీర్ ఆరంభంలో దక్కిన విజయాలు చూసి.. తోటి హీరోయిన్లు అసూయ చెంది ఉంటారు. కేవలం…
రేపు ఉదయం ఏడు గంటలు మొదలుకుని రణబాలి షోలు ఏపీ తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభం కాబోతున్నాయి. ముందు రోజు ప్రీమియర్లు…