ఏఐతో 100 కోట్ల ప్రాణాలకు ముప్పు?

సాంకేతిక రంగంలో పెను విప్లవానికి దారి తీస్తున్న ఏఐ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకముందే ప్రపంచాన్ని హడలెత్తిస్తుంది. అణ్వాయుధాల కంటే ప్రమాదకరమని కొంతమంది నిపుణులు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. అందుకే ప్రపంచం దేశాలు అణ్వాయుధాలను దుర్వినియోగం చేయంటూ ఎలాగైతే సంతకాలు చేసారో అదే విధంగా ఏఐని దుర్వినియోగం చేయమంటూ ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని భారత్ సహా అనేక దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో అనేకసార్లు ప్రపంచాన్ని హెచ్చరించారు కూడా. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ చేసిన వ్యాఖ్యలు గుబులు పుట్టిస్తున్నాయి.

ఎన్బీసీ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్యూలో బిల్ గేట్స్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. అదుపులేని కృత్రిమ మేధతో మానవాళికి తీవ్రమైన ప్రమాదం పొంచి వుందని ఆయన హెచ్చరించారు. దుష్ట ఆలోచనలు కలిగిన వ్యక్తుల చేతుల్లోకి ఏఐ వెడితే ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అవధుల్లేనంతటి శక్తివంతం కాకుండా ఏఐ మీద ప్రభుత్వాలు నియంత్రణ విధించాల్సిన అవసరం వుందని సూచించారు. బిల్ గేట్స్ కామెంట్స్ తో నిపుణులు సైతం ఏకీభవిస్తున్నారు.

ఏఐ ఏజెంట్లు అదుపుతప్పి ప్రవర్తిస్తున్నాయన్న నివేదికలు ప్రపంచాన్ని నివ్వెర పరుస్తున్నాయి. కొన్ని ఏఐలు తమకు అప్పగించిన పనులకు మించి ముందుకు వెళుతున్నట్లు చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఏఐ సంస్థ ‘ఓపెన్ ఏఐ’ తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. ఏఐ మోడళ్లకు ఇస్తున్న శిక్షణను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచేత్తింది. తగిన భద్రత అందుబాటులోకి వచ్చిన తర్వాత, పూర్తిస్తాయి నమ్మకం కుదిరాకనే ఏఐ మోడల్ల శిక్షణ తిరిగి మొదలుపెడతామని స్పష్టం చేసింది. ఇలా శిక్షణ నిలిపివేయడం ఇది రెండోసారి.

ఏఐ ఏజెంట్లు సొంతంగా ప్రవర్తించడం పట్ల నిపుణులు ఆందోళనకు గురవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రోబో సినిమా తరహాలో ఏఐ ఏజెంట్లు వ్యవహరించడం మనవాళికి ముప్పని ధృవీకరిస్తున్నారు. ఒకసారి పరిస్థితి మన చేయి దాటితే ఊహించని విపరిణామాలు చోటు చేసుకోవచ్చు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా అపుడేం చేయలేమన్నది సుస్పష్టం. ఈ క్రమంలోనే ఓపెన్ ఏఐ ప్రత్యర్థి కంపెనీ ఆన్త్రోపీక్ కూడా ఏఐకి కళ్లెం వేయాల్సిందే అని ప్రకటించింది.