మహిళలు మీసాలు పెంచలేరని.. పురుషులు గర్భాన్ని దాల్చలేరని సామెత!. అయితే.. ఇటీవల కాలంలో రష్యాకు చెందిన ఓ మహిళ మీసాలు పెంచి చూపించింది. కానీ, ఏ పురుషుడు… గర్భం దాల్చిన ఘటనలు అయితే కనరాలేదు. కానీ, ఇప్పుడు కొత్తగా మరింత వింతగా ఢిల్లీకి చెందిన ఓ యువకుడికి గర్భాశయం ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అంతేకాదు.. మహిళల్లో గర్భధారణకు కీలకమైన ఫెలోపియన్ ట్యూబ్ కూడా ఈ యువకుడి గర్భంలో ఉన్నాయని గుర్తించి అవాక్కయ్యారు. ఇది ప్రపంచంలోనే అత్యంత వింత ఘటనగా పేర్కొన్నారు.
ఢిల్లీకి చెందిన దంపతులకు పిల్లలు పుట్టలేదు. దీంతో భర్త(యువకుడు) వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. ఈ పరీక్షల్లో భాగంగా యువకుడికి స్కానింగ్ చేయగా.. అతని పొత్తికడుపు భాగంలో గర్భాశయంతోపాటు ఫెలోపియన్ ట్యూబ్ ఉన్నట్టు గుర్తించిన వైద్యులు ఆశ్చర్యపోయారు. దీనిని పర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిండ్రోమ్ అని వ్యవహరిస్తారని వైద్యులు పేర్కొన్నారు. పురుషుల్లో మహిళలకు మాత్రమే పరిమితమైన గర్భాశయం.. ఫెలోపియన్ ట్యూబ్స్‌వంటివి అత్యంత అరుదుగా ఉంటాయని.. ఇప్పటి వరకు ఇలాంటి కేసులు నమోదు కాలేదని తెలిపారు.
అయితే.. ఫెలోపియన్ ట్యూబ్ మాత్రమే ఉన్నట్టు ప్రపంచంలోని పలు దేశాల్లో కేసులు నమోదైనా అవిధ్రువీకరించలేదని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుత కేసులో మాత్రం నిర్ధారణ అయిందని వివరించారు. కాగా.. ఇవి సర్వసాధారణంగా ఇబ్బంది పెట్టకపోయినా.. పునరుత్పత్తికి విఘాతం కలిగిస్తాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే సంతానం కలగడం లేదని గుర్తించారు. దీంతో సదరు యువకుడికి వాటిని తొలగించారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొన్నారు. అయితే.. భవిష్యత్తులో సంతానం కలిగే విషయం ఇప్పటికిప్పుడు చెప్పలేమని తేల్చేశారు.
This post was last modified on September 9, 2026 8:10 pm
మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…
ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…
కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన…
2019-24 మధ్య జగన్ జమానాలో ఏపీలో నాణ్యమైన మద్యం కరువైన సంగతి తెలిసిందే. తన మంత్రులు, అనుయాయులకు సంబంధించిన డిస్టిలరీల…
ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి…
యూత్ హీరోలు ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఆర్థికంగా ఏమో కానీ కెరీర్ పరంగా ఇబ్బందులు చూడాల్సిన పరిస్థితులు ఇండస్ట్రీలో…