Trends

ఇక RCB అభిమానులను ఎవరు ఆపలేరు

పద్దెనిమిదేళ్ల అవమానాలు, ఎగతాళి మాటలకు బెంగళూరు జట్టు శాశ్వతంగా ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన జట్టు, ఇప్పుడు వరుసగా రెండుసార్లు కప్పు గెలిచి విమర్శకుల నోళ్లు మూయించింది. ఒకప్పుడు 49 పరుగులకే ఆలౌట్ అయ్యారని నవ్విన వాళ్లే, నేడు ఆ జట్టు సాధించిన బ్యాక్ టు బ్యాక్ విజయాలను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎన్నో ఏళ్ల నిరాశను చెరిపేస్తూ ఆర్సీబీ సాధించిన ఈ డబుల్ విక్టరీ అభిమానులకు అసలైన పండగ లాంటిది.

ఈ సాలా కప్ నమదే అనే డైలాగ్ చాలా కాలం పాటు కేవలం సోషల్ మీడియా మీమ్స్ కే పరిమితమైంది. ప్రతి సీజన్ లో కప్పు మనదే అనుకోవడం, చివరికి నిరాశతో వెనుతిరగడం ఫ్యాన్స్ కు అలవాటుగా మారింది. కనీసం విరాట్ కోహ్లీ కోసమైనా ఒక్కసారి ట్రోఫీ గెలవాలని సగటు క్రికెట్ అభిమాని కోరుకున్నాడు. ఇక సరిగ్గా 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత గత ఏడాది ఆ కల నెరవేరింది. విరాట్ జెర్సీ నంబర్ 18 కావడంతో, ఆ అంకెలతో ముడిపడిన ఎమోషన్ అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేసింది.

గత ఏడాది కప్పు గెలవగానే, ఏదో అదృష్టం కొద్దీ ఒక్కసారి గెలిచారని కొందరు వెటకారం చేశారు. ఫ్లూక్ లో కొట్టిన కప్పు అంటూ సోషల్ మీడియాలో మళ్లీ నెగెటివ్ కామెంట్స్ మొదలయ్యాయి. కానీ ఆ మాటలను ఆర్సీబీ ఆటగాళ్లు చాలా సీరియస్ గా తీసుకున్నారు. తమ గెలుపు గాలివాటం కాదని నిరూపిస్తూ, 2026 సీజన్ లో కూడా అద్భుత ఆటతీరుతో ఫైనల్ చేరి వరుసగా రెండో ట్రోఫీని ముద్దాడారు. ఒకసారి గెలిస్తేనే ఎగిరి గంతేసిన ఫ్యాన్స్ కు ఈ రెండో కప్పు అసలైన కిక్ ఇచ్చింది.

ఈ ఫైనల్ మ్యాచ్ లో గెలుపు ముంగిట విరాట్ కోహ్లీ కొట్టిన ఆ సిక్సర్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ బంతి గాల్లోకి లేవగానే స్టేడియంతో పాటు బయట కూడా పండగ వాతావరణం మొదలైంది. బంతి బౌండరీ లైన్ దాటి కప్పు ఖాయం అవ్వగానే ఆర్సీబీ అభిమానులు వీధుల్లోకి వచ్చి టపాసులు పేల్చారు. తమ ఆరాధ్య దైవం లాంటి విరాట్ చేతుల మీదుగానే విన్నింగ్ షాట్ రావడం ఫ్యాన్స్ కు ఎక్కడలేని ఉత్సాహాన్ని ఇచ్చింది.

ఇకపై ఆర్సీబీ అంటే ఓడిపోయే జట్టు కాదు, ఆధిపత్యం చెలాయించే ఛాంపియన్ టీమ్ అనే ట్యాగ్స్ వస్తున్నాయి. దశాబ్దన్నర పాటు పడ్డ బాధలు, కన్నీళ్లు ఈ రెండు ట్రోఫీల ముందు చిన్నవిగా మారిపోయాయి. ఒక జట్టుపై నమ్మకం పెట్టుకుని, ఎన్నిసార్లు ఓడినా అండగా నిలబడ్డ అభిమానుల ఓపికకు దక్కిన అసలైన బహుమతి ఇది.

This post was last modified on June 1, 2026 12:42 am

Share

Recent Posts

ఫోన్ కోసం పుట్టిన పసికందునే అమ్మేశారు

ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్ని అంగడిలో సరుకులుగా మారిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. పాపాయి కంటే రూపాయికే…

11 minutes ago

జూనియర్ ఇచ్చిన జోష్ సరిపోతుందా

ఎల్లుండి విడుదల కాబోతున్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ప్రమోషన్ల ఘట్టం చివరి అంకాన్ని నిన్న దిగ్విజయంగా పూర్తి చేశారు.…

17 minutes ago

పార్టీ క‌న్నా ప‌రువు కాపాడుకునేదెలా…

కొంతమంది నాయకుల విషయంలో పార్టీ ముందు.. తర్వాత నాయకులు.. అనే మాట వినిపిస్తుంది. నిజంగా రాజకీయాల్లో కొత్తగా వచ్చినవారు యువతరం…

28 minutes ago

విజయవాడలో 10 కోట్లు… దేశంలోనే మొదటిసారి

సైబ‌ర్ నేరాల గురించి త‌ర‌చుగా వార్త‌లు వ‌స్తున్నాయి. బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్ర‌భుత్వాలు స‌హా రిజ‌ర్వ్ బ్యాంకు…

1 hour ago

ఒక్క యాడ్‌కు 40 కోట్ల పారితోష‌కం?

చాలా ఏళ్ల నుంచి త‌మిళ సినిమాను ఏలుతున్న హీరోల్లో అజిత్ ఒక‌డు. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్, ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌ర్వాత…

1 hour ago

ఖైర‌తాబాద్‌లో బీజేపీ క్యాండేట్‌ ఆయ‌నేనా?

తెలంగాణ‌లో కీల‌క‌మైన ఖైర‌తాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం విడుద‌ల…

5 hours ago