Trends

హైదరాబాద్ కుర్రాడు అదరగొట్టాడుగా..

పది రోజుల కిందట భారత క్రికెట్ జట్టు ఎంతటి పరాభవాన్ని ఎదుర్కొందో తెలిసిందే. అడిలైడ్‌లో ఆరంభమైన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి మ్యాచ్‌లో తొలి రెండు రోజులు ఆటలో పైచేయి సాధించి.. మూడో రోజు అనూహ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది భారత్.

భారత క్రికెట్ చరిత్రలోనే అది ఓ ఇన్నింగ్స్‌లో సాధించిన అత్యల్ప స్కోరు కావడంతో కోహ్లీ సేనకు అవమానంగా మారింది. అలాంటి సమయంలో కోహ్లి భార్య ప్రసవం కోసమని స్వదేశానికి వచ్చేశాడు. జట్టు ప్రధాన బౌలర్లలో ఒకడైన మహ్మద్ షమి గాయంతో సిరీస్‌కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో టెస్టు సిరీస్‌లో భారత జట్టు వైట్ వాష్‌కు గురవడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

కానీ రెండో టెస్టులో గొప్పగా పుంజుకుని అద్భుత ప్రదర్శన చేసిన భారత్.. ఆస్ట్రేలియా తొలి టెస్టులో ఎన్ని వికెట్ల తేడాతో అయితే నెగ్గిందో అదే విధంగా 8 వికెట్ల తేడాతో విజయం సాధించి వారెవా అనిపించింది. బౌలర్లు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అదరగొడితే.. బ్యాట్స్‌మెన్ కూడా బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు మంచి స్కోరు అందించారు.

ముఖ్యంగా తాత్కాలిక కెప్టెన్ సెంచరీతో జట్టును ముందుండి నడిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 195 పరుగులకే ఆలౌట్ కాగా.. భారత్ 326 పరుగులు సాధించి 131 పరుగుల కీలక ఆధిక్యాన్ని మూటగట్టుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 200 పరుగులకు ఆలౌటైంది. భారత్ ముందు 70 పరుగుల లక్ష్యం నిలవగా.. 2 వికెట్లే కోల్పోయి విజయాన్నందుకుని ఆస్ట్రేలియాపై ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది.

ఈ మ్యాచ్‌లో ఆశ్చర్యకర ప్రదర్శన అంటే.. మన హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌దే. షమి స్థానంలో జట్టులోకి వచ్చిన ఈ కుర్రాడు.. ఈ మ్యాచ్‌తోనే టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఐతే కొత్త బౌలర్ ఏం ప్రభావం చూపుతాడులే అనుకుంటే.. తొలి ఇన్నింగ్స్‌లో రెండు కీలక వికెట్లతో సత్తా చాటాడు. ఫీల్డింగ్‌లోనూ ఆకట్టుకున్నాడు. రెండు చక్కటి క్యాచ్‌లు అందుకున్నాడు.

రెండో ఇన్నింగ్స్‌లో సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ గాయపడి మైదానాన్ని వీడగా.. ఆ లోలు కనిపించకుండా బుమ్రాతో కలిసి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌కు సవాలు విసిరాడు. మూడు వికెట్లతో మెరిశాడు. ఇన్నింగ్స్ అయ్యాక అతణ్ని ముందు నడిపించి జట్టంతా చప్పట్లు కొడుతూ పెవిలియన్‌కు వెళ్లడం విశేషం. ఏ ఆటగాడికైనా ఇంతకంటే డ్రీమ్ డెబ్యూ ఇంకేముంటుంది? మరి ఈ జోరును కొనసాగిస్తూ భారత జట్టులో సిరాజ్ సుస్థిర స్థానం సంపాదించుకుంటాడేమో చూడాలి.

This post was last modified on December 29, 2020 2:37 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

కూటమి విజయాన్ని ఖరారు చేసిన వైసీపీ.?

వై నాట్ 175 అటకెక్కింది.. వై నాట్ 15 అనో.. వై నాట్ 17 అనో.. అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందిప్పుడు…

7 mins ago

ఏపీ ఎలక్షన్స్: చిరంజీవి రాక తప్పేలా లేదు.!

మెగాస్టార్ చిరంజీవి ఎక్కడ.? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కొద్ది రోజుల క్రితం జనసేన అభ్యర్థి పంచకర్ల…

9 mins ago

ఉండి పై రఘురామ ఉడుం పట్టు.!

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగిన…

11 mins ago

అప్పుడు బాలీవుడ్‌పై విమర్శలు.. ఇప్పుడేమో

రోమ్‌లో ఉన్నపుడు రోమన్‌లా ఉండాలని ఓ సామెత. సినిమా వాళ్ల విషయానికి వస్తే.. ఏ ఇండస్ట్రీలో సినిమా చేస్తే అక్కడి…

5 hours ago

థియేట్రికల్ రిలీజ్‌లు లైట్.. ఓటీటీ సినిమాలే హైలైట్

ఏప్రిల్ చివరి వారం అంటే పీక్ సమ్మర్.. ఈ టైంలో పెద్ద పెద్ద సినిమాలతో థియేటర్లు కళకళలాడుతుండాలి. రెండు గంటలు…

7 hours ago

పింఛ‌న్ల‌పై పిడుగు.. వైసీపీకి క‌ష్ట‌మేనా?

సామాజిక పింఛ‌న్ల పై పిడుగు ప‌డిన‌ట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంట‌రి మ‌హిళ లు.. వంటి సామాజిక పింఛ‌నుపై…

12 hours ago