భారత సీనియర్ క్రికెటర్ సురేష్ రైనా ఈ మధ్య క్రికెటేతర విషయాలతోనే వార్తల్లో నిలుస్తున్నాడు. యూఏఈలో ఐపీఎల్ ఆరంభానికి ముందు అతను వ్యక్తిగత కారణాలు చెప్పి అనూహ్యంగా టోర్నీ నుంచి తప్పుకుని స్వదేశానికి వచ్చేయడం ఎంత చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఇప్పుడు అతను ఒక క్లబ్బులో నిబంధనలకు విరుద్ధంగా పార్టీ చేసుకుని పోలీస్ స్టేషన్ గడప తొక్కాడు. సోమవారం రాత్రి అతణ్ని ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు.
అరెస్టయిన వారిలో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానె ఖాన్, సింగర్ గురు రందవా లాంటి ప్రముఖులూ ఉన్నారు. బ్రిటన్ సహా చాలా ఐరోపా దేశాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇండియాలో మళ్లీ వివిధ రాష్ట్రాల్లో కోవిడ్ నిబంధనలను కఠినతరం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇండియాలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న మహారాష్ట్రలో ఆంక్షలు పెట్టారు.
ఐతే నిబంధనలకు విరుద్ధంగా ముంబయిలోని క్లబ్బులు వ్యవహరిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు నగర వ్యాప్తంగా రైడ్స్ చేశారు. డ్రాగన్ ఫ్లై అనే క్లబ్బులో రైనా, సుసానె, గురు సహా చాలామంది ప్రముఖులు కరోనా నిబంధనలకు విరుద్ధంగా పార్టీలు చేసుకుంటుండటంతో ఆ క్లబ్‌ను సీజ్ చేసి మొత్తం 35 మందిని అరెస్టు చేశారు. అందులో సెలబ్రెటీలకు తోడు క్లబ్ నిర్వాహకులు, సిబ్బంది ఉన్నారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఐతే రైనా, సుసానె, గురు తదితరులను కాసేపటికే బెయిల్ మీద విడుదల చేశారు.
రైనాకు పార్టీలంటే చాలా ఇష్టమన్న సంగతి అందరికీ తెలిసిందే. ఉత్తర్ ప్రదేశ్‌లో నివాసముండే రైనా.. ఇలా ముంబయికి వచ్చి సుసానె తదితరులతో పార్టీ చేసుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. రైనా ఏడాదికి పైగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అతడికి భారత జట్టులో చోటు పోయి చాలా కాలమైంది. దేశవాళీల్లో కూడా పెద్దగా ఆడట్లేదు. కరోనా విరామం తర్వాత ఐపీఎల్ ఆడదామనుకుంటే అనూహ్యంగా దాన్నుంచి తప్పుకుని స్వదేశానికి వచ్చేయాల్సి వచ్చింది. త్వరలోనే అతను ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో యూపీ తరఫున ఆడే అవకాశాలున్నాయి.
This post was last modified on December 22, 2020 2:43 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…