Trends

పదవిపై గంభీర్ షాకింగ్ వ్యాఖ్యలు

సౌతాఫ్రికా చేతిలో టీమిండియా 0-2 తేడాతో వైట్‌వాష్ అవ్వడం భారత క్రికెట్ వర్గాల్లో పెద్ద దుమారమే రేపింది. గత 25 ఏళ్లలో సఫారీలు మన గడ్డపై సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. ఈ ఘోర పరాభవంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడింది. రెండో టెస్టులో 408 పరుగుల భారీ తేడాతో ఓడిపోయిన తర్వాత, గంభీర్ మీడియా ముందుకొచ్చి చాలా ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తన కోచింగ్ పదవిపై నిర్ణయం తీసుకోవాల్సింది బీసీసీఐ పెద్దలే అని స్పష్టం చేశారు.

గంభీర్ తనదైన శైలిలో మాట్లాడుతూ, “నేను పదవిలో ఉండాలా వద్దా అనేది బోర్డు ఇష్టం. నేను ముఖ్యం కాదు, భారత క్రికెట్ బాగుపడటమే ముఖ్యం. నేను ఇంగ్లాండ్‌లో ఫలితాలు రాబట్టాను, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిపించిన కోచ్‌ని కూడా నేనే. ఈ టీమ్ ఇంకా నేర్చుకునే దశలోనే ఉంది” అని తనను తాను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. గెలుపులను గుర్తు చేస్తూనే, ఓటమి బాధ్యతను కూడా స్వీకరించారు.

ఈ సిరీస్ ఓటమికి కారణం ఎవరని అడిగినప్పుడు, గంభీర్ ఎవరి పేరు చెప్పకుండా అందరిదీ బాధ్యత అని అన్నారు. “కేవలం ఆటగాళ్లను నిందించలేం. 95/1 నుంచి 122/7కి కుప్పకూలడం ఆమోదయోగ్యం కాదు. కానీ బ్లేమ్ గేమ్ ఆడదలుచుకోలేదు. తప్పు నా దగ్గర్నుంచే మొదలవుతుంది” అని నిజాయితీగా ఒప్పుకున్నారు. అయితే, గతంలో న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్, ఇప్పుడు సౌతాఫ్రికా దెబ్బతో గంభీర్ కోచింగ్ స్టైల్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గణాంకాలు చూస్తే గంభీర్ హయాంలో భారత్ రికార్డు మరీ దారుణంగా ఉంది. ఇప్పటివరకు 18 టెస్టులు ఆడితే, అందులో 10 మ్యాచ్‌ల్లో భారత్ ఓడిపోయింది. జట్టులో కొత్త ముఖాలు వచ్చినా ఫలితం మారలేదు. గంభీర్ తరచూ జట్టును మారుస్తున్నారని, స్పెషలిస్ట్ ప్లేయర్ల కంటే ఆల్‌రౌండర్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శ ఉంది. దీనికి ఆయన బదులిస్తూ, టెస్టులు ఆడాలంటే టాలెంట్ ఒక్కటే సరిపోదని, “టఫ్ క్యారెక్టర్” ఉన్న వాళ్లు కావాలని తేల్చి చెప్పారు.

టెస్ట్ క్రికెట్‌లో భారత్ మళ్లీ పుంజుకోవాలంటే ఏం చేయాలనే ప్రశ్నకు గంభీర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. “టెస్ట్ క్రికెట్‌కు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇది సీరియస్ గేమ్. కేవలం ప్లేయర్లనో, కోచ్‌నో అంటే సరిపోదు. సమిష్టి కృషి ఉంటేనే ఫలితాలు వస్తాయి” అని హితవు పలికారు. గంభీర్ మాటలను బట్టి చూస్తే, ఆయన రాజీనామా చేసే ఉద్దేశంలో లేనట్లు కనిపిస్తోంది. బంతిని బీసీసీఐ కోర్టులోకి నెట్టేశారు. వరుస వైట్‌వాష్‌ల తర్వాత బోర్డు గంభీర్‌కు ఇంకో ఛాన్స్ ఇస్తుందా? లేక కఠిన నిర్ణయం తీసుకుంటుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

This post was last modified on November 26, 2025 5:20 pm

Share

Recent Posts

పంజా మీద ఇంత ప్రేమ దాచుకున్నారా

ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…

2 minutes ago

పవన్ కళ్యాణ్ – ఒక జన సేవకుడి ప్రస్థానం

సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…

2 hours ago

తమిళనాడులో అప్పుడే పెడాకులా…

మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…

2 hours ago

స్థానిక ఎన్నికలకు SIR చిక్కుముడి?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…

2 hours ago

జనసేన ఎమ్మెల్యేపై చంద్రబాబు అసంతృప్తి

కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…

4 hours ago

ఏపీలో పెరిగిపోతున్న బీపీ… ఆ జిల్లాలో మరీ ఎక్కువ!

ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…

5 hours ago