ఎన్నో ఏళ్లుగా ప్రపంచ క్రికెట్లో అగ్ర జట్లలో ఒకటిగా వెలుగొందుతూ వచ్చింది టీమ్ ఇండియా. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి మన జట్టు వరుస ఓటములు ఎదుర్కొంటుండడం.. సిరీస్‌లు కోల్పోతుండడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ముఖ్యంగా టెస్టుల్లో సొంతగడ్డపై ఇండియాకు ఎదురవుతున్న పరాభవాలు షాక్‌కు గురి చేస్తున్నాయి. పన్నెండేళ్ల పాటు సొంతగడ్డపై సిరీసే కోల్పోని భారత్.. గత ఏడాది న్యూజిలాండ్ జట్టు చేతిలో వైట్ వాష్‌కు గురి కావడం అందరినీ విస్మయానికి గురి చేసింది.
తర్వాత ఆస్ట్రేలియాలో సిరీస్ పోయింది. ఇప్పుడు సొంతగడ్డపై ఇంకో సిరీస్ ఓటమికి రంగం సిద్ధమైంది. దక్షిణాఫ్రికా చేతిలో ఆల్రెడీ తొలి టెస్టులో ఓడిన భారత జట్టు.. రెండో టెస్టులో కూడా ఓడేలా కనిపిస్తోంది. దక్షిణాఫ్రికా 489 పరుగులు చేసిన చోటే.. ఇండియా 201 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో ఎంత పోరాడినా మహా అయితే డ్రా చేసుకోగలరు. కాబట్టి సిరీస్ చేజారడం ఖాయం.
ఈ ఓటములకు ప్రధానంగా బాధ్యత ఎవరిది అనే ప్రశ్న ఎదురవడం సహజం. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల చేతుల్లో ఓడేసరికి కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లిలను చాలామంది విమర్శించారు. ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు టెస్టులకు గుడ్ బై చెప్పేశారు. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం జట్టును ఖాళీ చేయాల్సి వచ్చింది. ఈ ముగ్గురికీ పొమ్మనకుండా పొగపెట్టేశారనే చర్చ జరిగింది. దీని వెనుక గౌతమ్ గంభీర్ ఉన్నాడనే ఆరోపణలు వినిపించాయి. కానీ ఇప్పుడు సొంతగడ్డపై మరో సిరీస్ పోతోంది. దీనికి మరి ఎవరు బాధ్యులు అన్నది ప్రశ్న.
గంభీర్ వచ్చాక భారత జట్టు.. శ్రీలంకలో, ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్‌లు సైతం ఓడింది. ఎన్నో ఏళ్లుగా ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యం చలాయిస్తున్న జట్టు.. గంభీర్ కోచ్ అయిన ఏడాదిలో మూడు టెస్టు సిరీస్‌లు, రెండు వన్డే సిరీస్‌లు ఓడింది. వీటికి బాధ్యత వహించాల్సింది అతనే కదా? ఇప్పటిదాకా విమర్శల తాకిడిని గంభీర్ ఎలాగోలా తట్టుకున్నాడు కానీ.. ప్రస్తుత సిరీస్ అవ్వగానే అతను కొనసాగడం చాలా కష్టమవుతుంది. అతడిపై వేటు కోసం గట్టిగా డిమాండ్లు వినిపించవచ్చు. ఈ ఓటములకు బాధ్యత వహిస్తూ గంభీరే స్వయంగా తప్పుకొన్నా ఆశ్చర్యం లేదు.
This post was last modified on November 25, 2025 10:52 am
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…
ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…