Trends

టీమ్ ఇండియా ఫాస్టెస్ట్ పేసర్స్.. ఏమైపోతున్నారు?

ప్రస్తుతం భారత జట్టులో బుమ్రా ఒక్కడే ప్రధాన బౌలర్ గా ఉన్నాడు. అతను గాయంతో గ్యాప్ ఇస్తే ఆ రేంజ్ లో భర్తీ చేసే బౌలర్ లేడు అనేది వాస్తవం. అర్షదీప్ ఉన్నా కూడా ఇంకా అతనికి అనుభవం రావాల్సి ఉంది. ఇక హర్షిత్ రానాను లక్కు మీద ఆడించడమే సరిపోతుంది. ఇక సిరాజ్ కూడా బుమ్రా రేంజ్ లో క్లిక్ కాలేదు. ముఖ్యంగా 150 స్పీడ్ తో అదరగొట్టే కొంతమంది పేసర్లు జట్టులో స్థానం కోల్పోవడం, గాయాల పాలవడం లేదా వారి ఫామ్‌ను నిలబెట్టుకోలేకపోవడం భారత క్రికెట్‌కు ఆందోళన కలిగిస్తోంది. 

టీమ్ ఇండియా తరఫున అత్యంత వేగంగా బౌలింగ్ చేయగలిగే బౌలర్ల ప్రస్తుత పరిస్థితిని చూస్తే, భవిష్యత్తులో నమ్మకమైన బ్యాకప్ పేసర్లు దొరుకుతారా అనే సందేహం కలుగుతోంది. ఈ జాబితాలో ముందున్న పేరు ఉమ్రాన్ మాలిక్ (157 kmph). అతని అద్భుతమైన వేగం కనిపించినా, ఇప్పుడు జట్టు నుంచి కనిపించకుండా పోయాడు. అలాగే, మయాంక్ యాదవ్ (156.7 kmph) లాంటి వారు గొప్ప వేగంతో అరంగేట్రం చేసినా, వెంటనే గాయాల పాలై జట్టుకు దూరమయ్యారు. 

సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ (153.2 kmph) వన్డే ప్రపంచకప్ తర్వాత అద్భుతమైన ఫామ్‌లో ఉన్నా, అతన్ని టీమ్ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. వేగంలో మెరుగ్గా ఉన్నప్పటికీ, మరికొందరు పేసర్లు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. నవదీప్ సైనీ (152.8 kmph) ఫామ్ కోల్పోయి, కనిపించకుండాపోయాడు. మరో సీనియర్ పేసర్ ఉమేష్ యాదవ్ (152.5 kmph) అయితే రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్నాడు. ఈ అనుభవజ్ఞుల స్థానాన్ని భర్తీ చేయాల్సిన యువ ఆటగాళ్ల పరిస్థితి కూడా సరిగా లేదు.

యువ పేసర్లైన శివం మావి (149.3 kmph) జాబితాలో మిస్సింగ్ అయితే, కమలేష్ నాగర్‌కోటి (149 kmph) గాయాల కారణంగా కనుమరుగయ్యాడు. అత్యధిక వేగంతో బౌలింగ్ చేయగల ఈ టాలెంటెడ్ ఆటగాళ్లు ఫిట్‌నెస్, స్థిరత్వం లేకపోవడంతో కెరీర్‌లో ఇబ్బందులు పడుతున్నారు. ఇక ప్రసిధ్ కృష్ణ (150.6 kmph)  ఆవేష్ ఖాన్ (147.6 kmph) వంటి యువ ఆటగాళ్లు తమ బౌలింగ్‌లో స్థిరత్వాన్ని చూపించలేకపోతున్నారు. అప్పుడప్పుడు మెరిసినా, నిలకడగా జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్నారు. ఇది టీమ్ ఇండియాకు ముఖ్యంగా ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నమెంట్ల ముందు ఆందోళన కలిగిస్తోంది.

ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితిని బట్టి చూస్తే, దేశానికి ఫాస్ట్‌గా బౌలింగ్ చేయగల మంచి బ్యాకప్ రిజర్వ్ బలం ఉందా అనే అనుమానం కలుగుతోంది. మేనేజ్‌మెంట్ వీలైనంత త్వరగా వీరిలో కొంతమంది యువ పేసర్లకు సరైన ఫిట్‌నెస్ ఫామ్ గైడెన్స్‌ ఇచ్చి, వారిని అంతర్జాతీయ క్రికెట్‌కు సిద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

This post was last modified on October 16, 2025 10:10 am

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

8 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

10 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

10 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

10 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

10 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

11 hours ago