Trends

‘ఆధార్’ పై UK ప్రధాని కన్ను.. కాపీ కొట్టే ప్లాన్!

బ్రిటన్ రాజకీయాల్లో ఇప్పుడు ఇండియాకు చెందిన ఆధార్ మోడల్ పెద్ద చర్చకు దారితీస్తోంది. యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ఇటీవలి ఇండియా పర్యటనలో, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకనితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటంటే, భారతదేశం యొక్క ఆధార్ తరహాలో యూకేలో కూడా కంపల్సరీ డిజిటల్ ఐడీ వ్యవస్థను తీసుకురావాలనే ప్లాన్. స్టార్మర్ ఈ ఆలోచనపై చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇండియాలో ఇది హిట్‌ అయింది కాబట్టే, తాను కూడా ఈ మోడల్‌ను స్టడీ చేస్తున్నట్లు ఆయన ముంబై బయలుదేరే ముందు మీడియాకు చెప్పారు.

డిజిటల్ ఐడీ కార్డుల ప్లాన్‌పై స్టార్మర్ ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంది. ఈ ఐడీ కార్డు లేకుండా, బ్రిటన్‌లో ఎవరూ పని చేయడానికి వీల్లేదని ఆయన గత నెలలోనే ప్రకటించారు. అక్రమంగా దేశంలోకి వచ్చి పని చేసేవారిని అరికట్టడానికి, అండర్‌గ్రౌండ్ ఎకానమీని కంట్రోల్ చేయడానికి ఇది హెల్ప్ అవుతుందని ఆయన అంటున్నారు. అంతేకాకుండా, హెల్త్‌కేర్, వెల్ఫేర్ వంటి ప్రభుత్వ సేవలను ప్రజలు సింపుల్‌గా యాక్సెస్ చేయడానికి కూడా ఈ డిజిటల్ ఐడీ చాలా ఉపయోగపడుతుందని స్టార్మర్ చెబుతున్నారు.

యూకేలో ఇలాంటి ఐడీ కార్డులపై తీవ్ర వ్యతిరేకత ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత సాధారణ పౌరులకు తప్పనిసరి ఐడెంటిటీ కార్డులు అక్కడ లేవు. విపక్ష పార్టీలు, పౌర హక్కుల కార్యకర్తలు ఈ స్కీమ్‌ను వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతం అని, ప్రైవేట్ డేటాకు రిస్క్ అని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ కూడా బయోమెట్రిక్ ఐడీ కార్డులు తేవాలని చూసినా, ప్రజా వ్యతిరేకతతో ఆ ప్లాన్ ఆగిపోయింది.

అయితే స్టార్మర్ మాత్రం తన ప్లాన్ వర్కౌట్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు. “పిల్లలను స్కూల్‌లో చేర్చాలన్నా, దేనికైనా అప్లై చేయాలన్నా మూడు బిల్లులు వెతుక్కునే బాధ తప్పిపోతుంది. ఇది నాకు చాలా చిరాకు తెప్పిస్తుంది” అని ఆయన తన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ సమస్యలన్నింటికీ డిజిటల్ ఐడీ పరిష్కారం చూపుతుందని ఆయన వాదిస్తున్నారు.

ప్రస్తుతానికి యూకే ప్లాన్‌లో బయోమెట్రిక్ డేటాను వాడే ఆలోచన లేదని స్టార్మర్ ప్రతినిధి చెప్పారు. అంటే, వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ లాంటివి లేకుండా సింపుల్‌గా డిజిటల్ ఐడీని తేవడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట. యూరోప్‌తో పోలిస్తే, బ్రిటన్ ‘పేపర్స్, ప్లీజ్’ సొసైటీ కాదనే భావన అక్కడ బలంగా ఉంది. కానీ అన్ని చోట్లా ఐడీ ప్రూఫ్ అవసరం అవుతున్న ఈ రోజుల్లో, డిజిటల్ ఐడీ నిజంగానే యూజర్‌ఫుల్‌గా ఉంటుందని కొందరు నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. అందుకే, స్టార్మర్ ఇండియాలో సక్సెస్ అయిన ‘ఆధార్’ స్ట్రాటజీని ఫాలో అవ్వాలని చూస్తున్నారు, కానీ ఆ దేశ ప్రజల వ్యతిరేకతను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

This post was last modified on October 9, 2025 9:50 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ సారీ చెప్పకపోతే… సినిమాటోగ్రఫీ మినిస్టర్ వార్నింగ్

తెలంగాణ నాయకులు పదే పదే గోదారి పచ్చదనం గురించి మాట్లాడడం, దిష్టి తగలడం వల్లే పచ్చటి కోనసీమ కొబ్బరి తోటలు…

1 hour ago

ఏపీలో ఫిల్మ్ టూరిజం… కూటమి మాస్టర్ ప్లాన్

ఏపీలో ఫిల్మ్ టూరిజానికి ప్రోత్సాహం ఇవ్వాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. దేశంలోనే సినిమా షూటింగ్‌ లకు…

2 hours ago

ల్యాగ్ అంటూనే బండి లాగేస్తోంది

ధనుష్ కొత్త హిందీ సినిమా తేరే ఇష్క్ మే బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బాగానే బండి లాగేస్తోంది. ట్రేడ్ నుంచి…

2 hours ago

పెద్ద రిస్క్ తీసుకున్న ఒక్కడు డైరెక్టర్

మూవీ లవర్స్ కి పరిచయం అక్కర్లేని పేరు గుణశేఖర్. బాలనటుడిగా జూనియర్ ఎన్టీఆర్ ని రామాయణంతో పరిచయం చేసిన ఘనత…

3 hours ago

నేత‌లు తీరు.. బాబు ఆనందించిన క్ష‌ణాలు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు త‌ర‌చుగా పార్టీ నాయ‌కులు, ఎమ్మెల్యేలపై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే. దీనికి కార‌ణం.. వారు…

3 hours ago

రాజ‌కీయాల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన టీడీపీ ఎంపీ

వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి టీడీపీ ఎంపీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వ‌చ్చే 2029 ఎన్నిక‌ల్లో తాను పోటీ చేయ‌డం లేద‌న్నారు.…

4 hours ago