Trends

బీసీసీఐ.. సెంట్రల్ కాంట్రాక్ట్ వల్ల ప్లేయర్స్ కు ఎంత లాభమంటే?

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రతి సంవత్సరం సెంట్రల్ కాంట్రాక్ట్ ద్వారా భారత జట్టు సభ్యులకు వార్షిక వేతనం అందజేస్తుంది. ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి A+, A, B, C అనే నాలుగు గ్రేడ్లలో వర్గీకరిస్తారు. A+ గ్రేడ్‌లో ఉన్నవారు రూ.7 కోట్లు, A గ్రేడ్‌కి రూ.5 కోట్లు, B గ్రేడ్‌కి రూ.3 కోట్లు, C గ్రేడ్‌కి రూ.1 కోటి వార్షిక పారితోషికం లభిస్తుంది. మ్యాచ్ ఫీజులు అదనంగా ఉంటాయి. ఇది ఆటగాళ్లకు ఆర్థిక భద్రతను కల్పించడమే కాకుండా, జాతీయ జట్టుతో వారి స్థిరతను సూచించే గుర్తింపు కావడం విశేషం.

ఇప్పుడు BCCI కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, హర్షిత్ రాణా వంటి యువ ఆటగాళ్లకు చోటు దక్కనుందని వార్తలు వస్తున్నాయి. అభిషేక్ శర్మ ఇటీవల టీ20ల్లో అద్భుతంగా రాణించాడు. 17 అంతర్జాతీయ టీ20లు ఆడిన అతను, బీసీసీఐ విధించిన “గత ఏడాదిలో కనీసం 10 టీ20లు ఆడాలి” అన్న నిబంధనను పూర్తిగా అందుకున్నాడు. అందువల్ల అతనికి C గ్రేడ్ కాంట్రాక్ట్ అంటే రూ.1 కోటి వార్షిక వేతనం దక్కే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ ఆల్‌రౌండర్ నితీష్ రెడ్డి, ఇటీవల ఆసీస్‌తో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఐదు టెస్టులు ఆడాడు. ఇది BCCI ప్రామాణికత ప్రకారం సరిపోతుంది. అతనికీ రూ.1 కోటి C గ్రేడ్ కాంట్రాక్ట్ ఖాయంగా కనిపిస్తోంది. హర్షిత్ రాణా టెస్టుల్లో రెండు, వన్డేల్లో ఐదు, టీ20లో ఒకటి ఆడాడు. మూడు ఫార్మాట్లను కలిపితే అతనికి కూడా ఒక స్థిరమైన ప్రదర్శన ఉంది. కాబట్టి అతనికి కూడా అవకాశం ఉంది.

ఇక వరుణ్ చక్రవర్తి (18 టీ20లు, 4 వన్డేలు), శ్రేయస్ అయ్యర్ లాంటి ఆటగాళ్లకూ తిరిగి కాంట్రాక్ట్ లభించే అవకాశాలు ఉన్నాయన్నారు బీసీసీఐ వర్గాలు. రోహిత్ శర్మ, కోహ్లీ, బుమ్రా, జడేజా వంటి స్టార్లు ఎప్పటిలానే A+ గ్రేడ్‌లో కొనసాగుతారు. రెండు రోజుల్లో బీసీసీఐ అధికారికంగా ఈ జాబితాను విడుదల చేయనుంది. ఈ సారి యువతకు మంచి అవకాశాలు దక్కనున్నాయనే అభిప్రాయం కనిపిస్తోంది.

This post was last modified on April 18, 2025 4:45 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

7 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

9 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

10 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

10 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

10 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

11 hours ago