భారత క్రికెట్లో ప్రస్తుతం కోహ్లి, ధోనీల తర్వాత అత్యధికంగా అభిమానులున్న క్రికెటర్ రోహిత్ శర్మనే. దేశవ్యాప్తంగా అతడికి కోట్లాదిగా అభిమానులున్నారు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో బెస్ట్ లిమిటెడ్ ఓవర్స్ బ్యాట్స్‌మెన్‌లో ఒకడు రోహిత్. వన్డే, టీ20 ఓపెనర్లలో అతనే ది బెస్ట్ అన్నా కూడా అతిశయోక్తి కాదు. టీమ్ఇండియాకు వన్డేలు, టీ20ల్లో అతను వైస్ కెప్టెన్ కూడా.
ఐపీఎల్‌లో రోహిత్ ఘనతల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐతే ఐపీఎల్ అతడి జట్టు ముంబయి ప్లేఆఫ్ దిశగా దూసుకెళ్తున్న తరుణంలో అందరూ ఒక చేదు వార్త వినాల్సి వచ్చింది. రోహిత్ ఈ ఐపీఎల్‌లో ఇకపై ఆడబోడు. గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌ల్లోనూ రోహిత్ ఆడలేదు. రోహిత్ గాయం చిన్నదే, త్వరలోనే జట్టులోకి తిరిగొస్తాడు.. ప్లేఆఫ్స్‌లో జట్టును నడిపిస్తాడు. మరో కప్పు అందిస్తాడు అని అభిమానులు ఆశించారు.
కానీ రోహిత్ తొడ కండరాల గాయం తీవ్రత ఎక్కువ కావడంతో అతను ఐపీఎల్ మొత్తానికి మాత్రమే కాదు.. త్వరలో టీమ్ ఇండియా ఆస్ట్రేలియా పర్యటనకు కూడా దూరం అవుతున్నాడని తేలింది. తాజాగా ఈ పర్యటన కోసం భారత టీ20, వన్డే, టెస్టు జట్లను ప్రకటించగా.. ఆ మూడింట్లోనూ రోహిత్‌కు చోటు దక్కలేదు.
యూఏఈలో ఉన్న భారత ఫిజియో బృందం రోహిత్‌ను పరిశీలించి అతను రెండు మూడు నెలల పాటు క్రికెట్ ఆడలేడని తేల్చింది. దీంతో సెలక్టర్లు అతణ్ని ఆస్ట్రేలియా పర్యటనకు దూరం పెట్టారు. అంతకంటే ముందు ఐపీఎల్‌లో ముంబయి జట్టుకు రోహిత్ దూరం కావడం అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించేదే. కీలకమైన ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ లేకపోవడమూ జట్టుకు ఎదురు దెబ్బే. అభిమానులకు బాధ కలిగించేదే.
This post was last modified on October 27, 2020 8:22 am
ప్రముఖ నటుడు నానా పటేకర్ గురువారం కన్నుమూశారు. గోవాలోని తన నివాసంలో తీవ్ర గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే సమీపంలోని…
నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమాకు రిలీజ్ ముందు రోజు రాత్రి…
కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి విద్యపై ఆసక్తి, పట్టుదల తోడైంది. దీంతో చదువులో అత్యుత్తమ ఫలితాలను సాధించి ఇతర ఖైదీలకు…
జీవితం అన్నీ నేర్పిస్తుంది. కష్టాలు ఎలా జీవించాలో నేర్పిస్థాయి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ కవిత కుమారి. జార్ఖండ్‌లోని రామ్‌గఢ్ జిల్లా,…
మొత్తానికి ‘ది ప్యారడైజ్’ సినిమా థియేట్రికల్ రన్ చివరికి వచ్చేసింది. ఈ సినిమా రెండో వీకెండ్‌కు వచ్చేసరికి సరైన సినిమాలు…
ఇప్పుడు డబ్బుతో పాటు అన్ని సౌకర్యాలూ ఉన్నా సరే.. ఏమీ లేని ఒకప్పటి రోజులే బాగున్నాయి అనుకునేవాళ్లు చాలామందే ఉంటారు.…