టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తన సెమీఫైనల్ బెర్త్‌ను ఇప్పటికే ఖాయం చేసుకున్నా, లేటెస్ట్ గా ఒక విషయం జట్టును కొత్త ఆలోచనలకు దారితీస్తోంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో తొడ కండరాల గాయానికి గురైన కెప్టెన్ రోహిత్ శర్మ న్యూజిలాండ్‌తో లీగ్ చివరి మ్యాచ్‌కు అందుబాటులో ఉండేనా? లేదా విశ్రాంతి తీసుకుంటాడా? అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.
రెండు రోజుల విరామం అనంతరం బుధవారం భారత జట్టు తిరిగి ప్రాక్టీస్ ప్రారంభించింది. అయితే, రోహిత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయకుండా కేవలం జాగింగ్, ఫిజియో థెరపీకి పరిమితమయ్యాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్ మర్చి 2న ఉన్న నేపథ్యంలో, రోహిత్‌కి పూర్తి విశ్రాంతి ఇవ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సెమీఫైనల్ (మార్చి 4) ముందు అతని గాయం మరింత తీవ్రతరం కాకూడదనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే, రోహిత్ ఆడకపోతే జట్టులో మార్పులు అనివార్యమవుతాయి. రిషభ్ పంత్ లేదా వాషింగ్టన్ సుందర్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ నెట్స్‌లో వీరిద్దరూ ఎక్కువ సమయం బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే, శుభ్‌మన్ గిల్‌తో కలసి ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేయడానికి కెఎల్ రాహుల్‌ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి.
టీమిండియా ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది కాబట్టి, న్యూజిలాండ్‌పై గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచేందుకు ప్రయత్నిస్తుందా? లేదా కీలక ఆటగాళ్లను విశ్రాంతికి పంపించి జట్టును కచ్చితంగా సెమీస్‌కు సిద్ధం చేసుకుంటుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా, రోహిత్ ఫిట్‌నెస్‌పై టీమ్ మేనేజ్‌మెంట్ తీసుకునే నిర్ణయం టీమిండియా విజయ పరంపరపై ప్రభావం చూపనుంది.
This post was last modified on February 28, 2025 7:38 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…